బాల‌ల హ‌క్కుల పేరుతో దందా…. అచ్యుత‌రావుపై కేసు !

బాల‌ల‌హ‌క్కుల సంఘం పేరుతో అచ్యుత‌రావు వ‌సూళ్ల దందా బ‌య‌ట‌ప‌డింది. ఎస్ఆర్‌న‌గ‌ర్ పోలీసుస్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

మ‌ధురాన‌గ‌ర్ కాల‌నీ స్థ‌లానికి సంబంధించిన కేసులో అచ్యుత‌రావు వేలు పెట్టిన‌ట్లు తెలిసింది. ఈ కేసు విషయంలో… కోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. పిటిష‌న్ విత్ డ్రా చేసుకోవాలంటే పెద్ద మొత్తంలో డ‌బ్బులు ఇవ్వాల‌ని అచ్యుత‌రావు బెదిరించాడట‌.

ఇప్ప‌టికే కొంత మొత్తంలో డ‌బ్బులు ఇచ్చారట‌. అయితే మ‌రికొన్ని డ‌బ్బులకు డిమాండ్ చేయ‌డంతో విసిగిపోయిన సొసైటీవాళ్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

డ‌బ్బుల కోసం అచ్యుత‌రావు బెదిరిస్తున్నాడ‌ని పోలీసుల‌కు మ‌ధురాన‌గ‌ర్ సొసైటీ కార్య‌ద‌ర్శి సాంబ‌శివ‌రావు ఫిర్యాదు చేశారు. ఆయ‌న ఫిర్యాదు మేర‌కు ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఇంత‌కుముందు కూడా అచ్యుత‌రావు ప‌లువురిని బెదిరించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బాల‌లను వేధిస్తున్నార‌ని…చైల్డ్ రైట్స్ కింద కేసు పెడ‌తానని ప‌లువురి ద‌గ్గ‌ర డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం. అయితే వారెవ‌రూ కూడా బయటకు రాలేదు. పోలీసు కేసులు పెట్టలేదు.

మీడియాలో కొంద‌రి స‌హ‌కారంతో అచ్యుత‌రావు ఈ దందా కొన‌సాగించిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి అచ్యుత‌రావుపై మ‌రికొంద‌రు పోలీసుల‌ను ఆశ్ర‌యించేందుకు రెడీ అవుతున్నారు.