Telugu Global
NEWS

అది పెద్ద లిప్ట్ ఇరిగేషన్ కట్టా- బాబు... లిప్ట్‌ పేరేంటి సర్‌?- స్పీకర్..

టీడీపీ  హయాంలో అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతానికి పరిమితం చేశారన్న విమర్శపై సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించిన చంద్రబాబునాయుడు ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ట్రిపుల్‌ ఐటీ వైఎస్‌ హయాంలో వచ్చిందని స్పీకర్ చెప్పగా .. లేదు నేనే తెచ్చాను అంటూ చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. స్పీకర్ కూడా అంతే స్థాయిలో స్పందించారు. శ్రీకాకుళంలో ట్రిపుల్‌ ఐటీ వైఎస్ హయాంలో వచ్చిందన్న విషయం చదువుకున్న ఏ పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. శ్రీకాకుళానికి ట్రిపుల్ ఐటీ ప్రతిపాదనలు, ఆలోచన అన్ని వైఎస్ […]

అది పెద్ద లిప్ట్ ఇరిగేషన్ కట్టా- బాబు... లిప్ట్‌ పేరేంటి సర్‌?- స్పీకర్..
X

టీడీపీ హయాంలో అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతానికి పరిమితం చేశారన్న విమర్శపై సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించిన చంద్రబాబునాయుడు ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు.

ట్రిపుల్‌ ఐటీ వైఎస్‌ హయాంలో వచ్చిందని స్పీకర్ చెప్పగా .. లేదు నేనే తెచ్చాను అంటూ చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. స్పీకర్ కూడా అంతే స్థాయిలో స్పందించారు. శ్రీకాకుళంలో ట్రిపుల్‌ ఐటీ వైఎస్ హయాంలో వచ్చిందన్న విషయం చదువుకున్న ఏ పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. శ్రీకాకుళానికి ట్రిపుల్ ఐటీ ప్రతిపాదనలు, ఆలోచన అన్ని వైఎస్ హయాంలోనే రూపుదాల్చాలని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా వాసిగా చెబుతున్నానని.. గత ఐదేళ్లలో 23 ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీకి కేటాయించగా.. ఒక్క సంస్థను కూడా శ్రీకాకుళం జిల్లాకు ఇవ్వకపోవడంతో జిల్లాలోని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం జిల్లాకు రిమ్స్ ఆస్పత్రి వైఎస్‌ హయాంలోనే వచ్చిందన్నారు. టీడీపీ హయాంలో శ్రీకాకుళం జిల్లా వివక్షకు గురైందన్న విషయాన్ని అచ్చెన్నాయుడు కూడా గుర్తించుకోవాలని స్పీకర్‌ కోరారు. మరోసారి వెనుకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తే… తీవ్ర పరిణామాలు భవిష్యత్తులో ఎదురవుతాయని… కాబట్టి అభివృద్ధిని ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇలా అన్ని ప్రాంతాలకు సమంగా పంచాలని స్పీకర్ తమ్మినేని సీతారాం విజ్ఞప్తి చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిన ఘనత తనకే దక్కుతుందని చంద్రబాబు సభలో చెప్పుకున్నారు. దాంతో వెంటనే స్పందించిన స్పీకర్ తమ్మినేని… ”ఆ లిప్ట్ ఇరిగేషన్ పేరు ఏంటి సర్” అని చంద్రబాబును ప్రశ్నించారు. దాంతో చంద్రబాబు నీళ్లు నమిలారు. శ్రీకాకుళంలో కూడా ఇరిగేషన్ మీద తాము దృష్టి పెట్టామని చెప్పేందుకు తాను అలా చెబుతున్నానంటూ నాలుక మడతేశారు. దాంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, ఇతర సభ్యులు పక్కున నవ్వారు.

First Published:  17 Dec 2019 9:07 AM GMT
Next Story