Telugu Global
National

దిశ బిల్లుకు ఒడిషా లేఖ... ఆక్రోశం అణుచుకోలేకపోయిన చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టాన్ని ఆదర్శంగా తీసుకుని పలు రాష్ట్రాలు ముందడుగు వేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని లేఖ ద్వారా అభినందించింది. దిశ చట్టానికి సంబంధించిన కాపీలను పంపాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. తాజాగా ఒడిషా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అభినందించింది. దిశ చట్టానికి సంబంధించిన కాపీలను తమకూ పంపాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ విషయాన్నిస్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో ప్రకటించారు. దిశ చట్టాన్ని తాము కూడా యథాతథంగా అమలు […]

దిశ బిల్లుకు ఒడిషా లేఖ... ఆక్రోశం అణుచుకోలేకపోయిన చంద్రబాబు
X

ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టాన్ని ఆదర్శంగా తీసుకుని పలు రాష్ట్రాలు ముందడుగు వేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని లేఖ ద్వారా అభినందించింది. దిశ చట్టానికి సంబంధించిన కాపీలను పంపాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

తాజాగా ఒడిషా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అభినందించింది. దిశ చట్టానికి సంబంధించిన కాపీలను తమకూ పంపాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ విషయాన్నిస్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో ప్రకటించారు. దిశ చట్టాన్ని తాము కూడా యథాతథంగా అమలు చేస్తామని ఒడిషా ప్రభుత్వం చెప్పినట్టు స్పీకర్ వివరించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి గర్వకారణమని స్పీకర్ వ్యాఖ్యానించారు.

స్పీకర్ ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించగానే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పైకి లేచి.. ఈనెల 11న అత్యాచారానికి గురైన బాలిక అంశాన్ని ప్రస్తావించారు. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేస్తే మంత్రులు కనీసం పరామర్శించలేదని ఆరోపించారు. చంద్రబాబు కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు చేయగా స్పీకర్ అడ్డుతగిలారు. ఇది సరైన పద్దతి కాదని సూచించారు.

చంద్రబాబు ఆరోపణలకు హోంమంత్రి సుచరిత స్పందించారు. ఈనెల 11న బాలిక అత్యాచారం జరగ్గా వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాలిక కుటుంబానికి పరిహారం కూడా చెల్లించామని… నిన్ననే స్వయంగా తాము వెళ్లి బాలిక పరిస్థితిని ఆరా తీసి సాయం చేసి వచ్చామని హోంమంత్రి వివరించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం ప్రభుత్వం నుంచి ఎవరూ వెళ్లలేదు అంటూ అవాస్తవాలు చెబుతున్నారని తిప్పికొట్టారు.

First Published:  16 Dec 2019 10:38 PM GMT
Next Story