Telugu Global
Cinema & Entertainment

జబర్ధస్త్ పై నాగబాబు యుద్ధం ‘అదిరింది’..

జబర్ధస్త్.. తెలుగులోనే నంబర్ 1 కామెడీ షో. ఆ షో నుంచి బయటకు వచ్చిన నాగబాబు ఇప్పుడా షో పై యుద్ధం ప్రకటించేశారు. దాదాపు 7 సంవత్సరాలు ఆ షోతో ట్రావెల్ చేసిన నాగబాబు విభేదాలతో ఇప్పుడు జీతెలుగులో ‘అదిరింది’ అనే ప్రోగ్రాంను స్ట్రాట్ చేసి అందరికీ షాకిచ్చాడు. నాగబాబు లేకున్నా ‘జబర్ధస్త్’ షో రేటింగ్ తగ్గడం లేదని నిరూపించిన ఈటీవీ-మల్లెమాలపై సెటైర్ గా నాగబాబు ఈ ‘అదిరింది’ షో ప్లాన్ చేశారని అర్తమవుతోంది. ప్రతీ ఆదివారం […]

జబర్ధస్త్ పై నాగబాబు యుద్ధం ‘అదిరింది’..
X

జబర్ధస్త్.. తెలుగులోనే నంబర్ 1 కామెడీ షో. ఆ షో నుంచి బయటకు వచ్చిన నాగబాబు ఇప్పుడా షో పై యుద్ధం ప్రకటించేశారు. దాదాపు 7 సంవత్సరాలు ఆ షోతో ట్రావెల్ చేసిన నాగబాబు విభేదాలతో ఇప్పుడు జీతెలుగులో ‘అదిరింది’ అనే ప్రోగ్రాంను స్ట్రాట్ చేసి అందరికీ షాకిచ్చాడు.

నాగబాబు లేకున్నా ‘జబర్ధస్త్’ షో రేటింగ్ తగ్గడం లేదని నిరూపించిన ఈటీవీ-మల్లెమాలపై సెటైర్ గా నాగబాబు ఈ ‘అదిరింది’ షో ప్లాన్ చేశారని అర్తమవుతోంది. ప్రతీ ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ షో ప్రోమోను నాగబాబు రిలీజ్ చేశారు. ఈ షో ఖచ్చితంగా జబర్ధస్త్ కు పోటీ అని నాగబాబు తన ఎంట్రీ, డైలాగులతోనే చాటిచెప్పారు.

ఇప్పటికే జీతెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ అని కామెడీ షో మొదలుపెట్టిన నాగబాబు తాజాగా ట్విస్ట్ ఇచ్చాడు. దానిపేరును ‘అదిరింది’గా మార్చి కామెడీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో జబర్ధస్త్ పై, ఆ షోలోని గెస్టులపై, ఘాటు పంచులతో చెలరేగిపోయారు. మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ పంచ్ తో పవన్ కళ్యాణ్ భారీ డైలాగులతో నాగబాబు విడుదల చేసిన ప్రోమోతో జబర్ధస్త్ పై యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది.

ఇక నాగబాబు సారథ్యంలోని ‘అదిరింది’ ప్రోగ్రాంలో స్కిట్ టీం లీడర్లుగా వేణు, ధనరాజ్, ఆర్పీ, చంద్రాలు కనిపించబోతున్నారు. వీరంతా పాత జబర్ధస్త్ టీం లీడర్లే. వచ్చే ఆదివారం నుంచి ఈ షో అలరించబోతోంది. మరి ఈ ప్రోగ్రాం జబర్తస్త్ ను మించిపోతుందా లేదా అన్నది చూడాలి.

First Published:  17 Dec 2019 7:00 AM GMT
Next Story