Telugu Global
CRIME

వైఎస్ వివేకా కేసుపై టీడీపీ ఫోకస్, రంగంలోకి సల్మాన్ ఖుర్షీద్

వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా హంతకులు ఎవరో తేల్చలేకపోయారు. పలువురికి నోటీసులు ఇచ్చి పిలిచి విచారిస్తున్నారు… కానీ అసలు నిజం మాత్రం తేల్చడం లేదు. దీంతో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు ఇటీవల విచారించారు. ఆయన ప్రస్తుతం హై కోర్టును ఆశ్రయించారు. కేసును సీబీఐ కి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్ ను టీడీపీ […]

వైఎస్ వివేకా కేసుపై టీడీపీ ఫోకస్, రంగంలోకి సల్మాన్ ఖుర్షీద్
X

వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా హంతకులు ఎవరో తేల్చలేకపోయారు. పలువురికి నోటీసులు ఇచ్చి పిలిచి విచారిస్తున్నారు… కానీ అసలు నిజం మాత్రం తేల్చడం లేదు. దీంతో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు ఇటీవల విచారించారు. ఆయన ప్రస్తుతం హై కోర్టును ఆశ్రయించారు. కేసును సీబీఐ కి అప్పగించాలని కోరారు.

ఈ పిటిషన్ ను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీ టెక్ రవికి అండగా నిలుస్తోంది. హైకోర్టులో వాదనలు వినిపించేందుకు ఢిల్లీ నుంచి మాజీ కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ప్రముఖ లాయర్ సల్మాన్ ఖుర్షీద్ ను రప్పిస్తోంది. ఆయనే బీ టెక్ రవి తరపున వాదనలు వినిపిస్తారు.

ఖుర్షీద్ ను తీసుకురావడం ద్వారా ఈ కేసు విషయంలో టీడీపీ చాలా గట్టిగానే ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేకపోవడంతో…. ఈ కేసులో ప్రజల్లో చాలా అనుమానాలు మాత్రం రేకెత్తుతున్నాయి.

First Published:  16 Dec 2019 10:15 PM GMT
Next Story