Telugu Global
Cinema & Entertainment

బాలయ్య సరసన నటించడం లేదు

బాలయ్య-బోయపాటి సినిమాలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా. దాదాపు 2 రోజులుగా వార్తల్లో నలిగిన ఈ పుకారుపై క్లారిటీ వచ్చేసింది. బాలయ్య సినిమాలో తను నటించడం లేదని దబంగ్ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేసింది సోనాక్షి. “బాలకృష్ణ, బోయపాటి సినిమాలో నన్ను తీసుకున్నారంటూ కొన్ని రిపోర్టులు వస్తున్నాయి. దీనిపై నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నా నెక్ట్స్ సినిమా ఏంటనే విషయాన్ని అతి త్వరలో […]

బాలయ్య సరసన నటించడం లేదు
X

బాలయ్య-బోయపాటి సినిమాలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా. దాదాపు 2 రోజులుగా వార్తల్లో నలిగిన ఈ పుకారుపై క్లారిటీ వచ్చేసింది. బాలయ్య సినిమాలో తను నటించడం లేదని దబంగ్ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేసింది సోనాక్షి.

“బాలకృష్ణ, బోయపాటి సినిమాలో నన్ను తీసుకున్నారంటూ కొన్ని రిపోర్టులు వస్తున్నాయి. దీనిపై నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నా నెక్ట్స్ సినిమా ఏంటనే విషయాన్ని అతి త్వరలో వెల్లడిస్తాను.”

ఇలా బాలయ్య సినిమాపై స్పష్టమైన ప్రకటన చేసింది సోనాక్షి. సౌత్ లో ఆమె రజనీకాంత్ సరసన లింగ అనే సినిమా చేసింది. అటు బాలీవుడ్ లో సల్మాన్ సరసన నటించింది. వయసులో పెద్ద హీరోలకు ఈమె సరిగ్గా సూట్ అవుతుంది. అందుకే బాలయ్య సినిమా కోసం ఈమెను ప్రయత్నించినట్టు, అగ్రిమెంట్ అయినట్టు వార్తలొచ్చాయి.

అయితే అందులో నిజం లేదని సోనాక్షి ప్రకటించింది. దీంతో బాలయ్య హీరోయిన్ వేట మళ్లీ మొదటికొచ్చింది.

First Published:  17 Dec 2019 2:00 AM GMT
Next Story