Telugu Global
Cinema & Entertainment

రిచా గంగోపాధ్యాయ పెళ్లి చేసుకుంది

ప్రభాస్ సరసన మిర్చి సినిమాలో నటించిన రిచా గంగోపాధ్యయ పెళ్లి చేసుకుంది. వాషింగ్టన్ లో తన బాయ్ ఫ్రెండ్ జోను లాంఛనంగా వివాహం చేసుకుంది రిచా. మొదట వీళ్ల పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో, తర్వాత భారతీయ సంప్రదాయంలో జరిగింది. తన పెళ్లి మేటర్ ను రిచా గంగోపాధ్యాయ నిర్థారించింది. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత […]

రిచా గంగోపాధ్యాయ పెళ్లి చేసుకుంది
X

ప్రభాస్ సరసన మిర్చి సినిమాలో నటించిన రిచా గంగోపాధ్యయ పెళ్లి చేసుకుంది. వాషింగ్టన్ లో తన బాయ్ ఫ్రెండ్ జోను లాంఛనంగా వివాహం చేసుకుంది రిచా.

మొదట వీళ్ల పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో, తర్వాత భారతీయ సంప్రదాయంలో జరిగింది. తన పెళ్లి మేటర్ ను రిచా గంగోపాధ్యాయ నిర్థారించింది. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత రవితేజ సరసన మిరపకాయ్, ప్రభాస్ తో మిర్చి, వెంకీతో నాగవళ్లి, నాగ్ సరసన భాయ్ సినిమాలు చేసింది.

భాయ్ సినిమా తర్వాత సినిమాలు ఆపేసింది రిచా. వాషింగ్టన్ వెళ్లి పై చదువులు చదువుకుంటానని స్పష్టంచేసింది. చెప్పినట్టుగానే ఓ బిజినెస్ స్కూల్ లో జాయిన్ అయింది. అక్కడే ఆమెకి జో పరిచయం అయ్యాడు. తామిద్దరం రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామనే విషయాన్ని ఈ ఏడాది జనవరి లోనే ప్రకటించింది రిచా. ఇప్పుడు అతడ్ని పెళ్లాడింది.

First Published:  18 Dec 2019 12:23 AM GMT
Next Story