విజయ్ దేవరకొండకు రూ.48కోట్ల ఆఫర్?

టాలీవుడ్ రైజింగ్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు తెలుగులో మోస్ట్ పాపులర్ యూత్ ఫుల్ హీరోగా పేరుతెచ్చుకున్నారు. సంచలన సినిమాలతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటికే ప్రతీ సినిమాకు రూ.10 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చెబుతున్నారు.

ఇక మనోడి యాక్టింగ్ స్కిల్ చూసి బాలీవుడ్ లోనూ చాన్స్ వచ్చిందని.. త్వరలోనే చేయబోతున్నాడని తెలిసింది. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడని తెలిసింది.

తాజాగా బాలీవుడ్ నుంచే ఓ పెద్ద ఆఫర్ విజయ్ దేవరకొండకు వచ్చిందంట.. బాలీవుడ్ లోనే పెద్ద బ్యానర్ అయిన యష్ రాజ్ ఫిలింస్ వారు విజయ్ దేవరకొండతో కలిసి మల్టీ లాంగ్వేజ్ మూవీని రూపొందించాలని ప్లాన్ చేశారట.. ఈ మేరకు విజయ్ కు ఏకంగా 48 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు టాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఈ భారీ ఆఫర్ ను విజయ్ కాదనలేకపోయాడని… కరుణ్ జోహర్ కూడా చెప్పడంతో ఒప్పుకున్నట్టు తెలిసింది. ఈ మూవీ గనుక హిట్ అయితే విజయ్ ఇక పాన్ ఇండియా స్టార్ హీరో కావడం ఖాయమంటున్నారు.