Telugu Global
CRIME

దిశ నిందితుల మృతదేహాలు వారంలో మొత్తం కుళ్లిపోతాయ్ : గాంధీ వైద్యులు

దిశ నిందితుల మృతదేహాల భద్రత విషయంపై… ఇవాళ తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం చేసిన నిందితులు ఈ నెల 6న చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 16రోజులు గడవడంతో గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్న వారి మృతదేహాల పరిస్థితిపై హైకోర్టు ఆరా తీసింది. ఇప్పటికే మృతదేహాలు 50 శాతం డీకంపోజ్ అయ్యాయని.. మరో వారం రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ […]

దిశ నిందితుల మృతదేహాలు వారంలో మొత్తం కుళ్లిపోతాయ్ : గాంధీ వైద్యులు
X

దిశ నిందితుల మృతదేహాల భద్రత విషయంపై… ఇవాళ తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం చేసిన నిందితులు ఈ నెల 6న చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 16రోజులు గడవడంతో గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్న వారి మృతదేహాల పరిస్థితిపై హైకోర్టు ఆరా తీసింది.

ఇప్పటికే మృతదేహాలు 50 శాతం డీకంపోజ్ అయ్యాయని.. మరో వారం రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ హైకోర్టుకు తెలిపారు. దీంతో దేశంలోని మరేదైనా ఆసుపత్రిలో వాటిని భద్రపరిచే అవకాశం ఉందా అని డాక్టర్ శ్రవణ్‌ను కోర్టు ప్రశ్నించింది. దీనికి ఆయన తనకు తెలియదని సమాధానం ఇచ్చారు.

మరోవైపు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు న్యాయవాది కోరగా.. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు పోస్టు మార్టం చేశారని.. మళ్లీ చేయాల్సిన అవసరం లేదని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానం దృష్టికి తీసుకొని వచ్చారు.

ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతుండటంతో నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా గాంధీ ఆసుపత్రిలో భద్రపరిచారు. కాగా, మృతదేహాలు కుళ్లిపోతున్నాయని డాక్టర్లు వివరించడంతో.. వాటిని బంధువులకు అప్పగించడం గానీ వేరే ఆసుపత్రికి తరలించే విషయంలో గాని హైకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

దిశ నిందితుల మృతదేహాల రీ-పోస్టుమార్టంకై హైకోర్టు ఆదేశం

దిశ నిందితుల మృతదేహాలకు ఈ నెల 23 సాయంత్రం 5 గంటల లోపు రీ-పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంతో సంబంధం లేని ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులతో రీ-పోస్టుమార్టం చేయించి.. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇవాళ ఉదయం నుంచి ఈ కేసుపై సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.

First Published:  21 Dec 2019 2:03 AM GMT
Next Story