Telugu Global
Cinema & Entertainment

రూలర్ ఫస్ట్ డే కలెక్షన్

మొదటి రోజే నరకం చూపించాడు రూలర్. పాతికేళ్ల కిందటి కథ, అంతకంటే దారుణమైన సన్నివేశాలు, స్క్రీన్ ప్లేతో ఈ సినిమా అందర్నీ భయపెట్టింది. కానీ బాలయ్య సినిమా కావడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. తొలి రోజు ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. బాలయ్య స్టామినాకు ఈ ఓపెనింగ్స్ తక్కువే. కాకపోతే ఇంతకుముందు అతడు చేసిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో.. ఈ సినిమాకు ఓపెనింగ్స్ తగ్గిపోయాయి. ఇక మొదటి రోజే మూవీకి […]

రూలర్ ఫస్ట్ డే కలెక్షన్
X

మొదటి రోజే నరకం చూపించాడు రూలర్. పాతికేళ్ల కిందటి కథ, అంతకంటే దారుణమైన సన్నివేశాలు, స్క్రీన్ ప్లేతో ఈ సినిమా అందర్నీ భయపెట్టింది. కానీ బాలయ్య సినిమా కావడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. తొలి రోజు ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

బాలయ్య స్టామినాకు ఈ ఓపెనింగ్స్ తక్కువే. కాకపోతే ఇంతకుముందు అతడు చేసిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో.. ఈ సినిమాకు ఓపెనింగ్స్ తగ్గిపోయాయి. ఇక మొదటి రోజే మూవీకి ఫ్లాప్ టాక్ రావడంతో.. సోమవారం నుంచి ఈ సినిమాకు ఆక్యుపెన్సీ ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో రూలర్ కు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 0.68 కోట్లు
సీడెడ్ – రూ. 0.95 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.27 కోట్లు
ఈస్ట్ – రూ. 0.26 కోట్లు
వెస్ట్ – రూ. 0.25 కోట్లు
గుంటూరు – రూ. 1.20 కోట్లు
నెల్లూరు – రూ. 0.22 కోట్లు
కృష్ణా – రూ. 0.19 కోట్లు

First Published:  21 Dec 2019 9:28 AM GMT
Next Story