Telugu Global
Cinema & Entertainment

ఇది మాత్రం ఛీటింగ్ బన్నీ!

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ఇప్పటికే 3 పాటలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒకటి ఓ మోస్తరుగా హిట్ అవ్వగా, మిగతా 2 మాత్రం భయంకరంగా హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా నుంచి రాబోతున్న నాలుగో పాటపై అందర్లో చాలా ఆసక్తి నెలకొంది. ఆ క్రేజ్ కు తగ్గట్టే, నిన్న ఉదయం 10 గంటలకు అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి బుట్టబొమ్మ అనే సాంగ్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటన వచ్చేసింది. ఈ ప్రకటన రావడమే ఆలస్యం, […]

ఇది మాత్రం ఛీటింగ్ బన్నీ!
X

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ఇప్పటికే 3 పాటలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒకటి ఓ మోస్తరుగా హిట్ అవ్వగా, మిగతా 2 మాత్రం భయంకరంగా హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా నుంచి రాబోతున్న నాలుగో పాటపై అందర్లో చాలా ఆసక్తి నెలకొంది. ఆ క్రేజ్ కు తగ్గట్టే, నిన్న ఉదయం 10 గంటలకు అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి బుట్టబొమ్మ అనే సాంగ్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటన వచ్చేసింది.

ఈ ప్రకటన రావడమే ఆలస్యం, ఆ సినిమాతో సంబంధం ఉన్న కొందరు జనాలు ట్విట్టర్లో రెచ్చిపోయారు. సినిమా పాటా చాలా బాగుందంటూ ట్వీట్లు పెట్టారు. నేను విన్నానంటే, నేను విన్నానంటూ ఎగబడ్డారు. దీంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. తీరా ఆ సమయం రానే వచ్చింది. సరిగ్గా ఇక్కడే యూనిట్ అందరికీ షాకిచ్చింది. ‘బుట్ట బొమ్మ సాంగ్’ వస్తుందని ఎదురుచూసిన జనాలకు, కేవలం బుట్టబొమ్మ సాంగ్ టీజర్ మాత్రమే వచ్చి వెక్కిరించింది.

24 సెకెన్లు నిడివి ఉన్న ఈ టీజర్ కే ఇంత బిల్డప్ ఇవ్వడం ఏంటంటూ నెటిజన్లు కోపం వ్యక్తంచేస్తున్నారు. నిజానికి ఇలా టీజర్లు విడుదల చేస్తూనే సాంగ్స్ బయటకు తీసుకొస్తోంది యూనిట్. ఇంతకుముందు కూడా ఇలానే టీజర్లు ఇచ్చిన తర్వాత సాంగ్స్ రిలీజ్ చేసింది. ఈసారి కూడా అదే పనిచేసింది. కానీ ఆ మేటర్ ను స్పష్టంగా చెప్పలేకపోయింది. ఈరోజు వచ్చేది సాంగ్ కాదు, కేవలం టీజర్ అనే విషయాన్ని స్పష్టంగా చెబితే బాగుండేది. దీంతో చాలామంది నిరాశకు గురయ్యారు. సినిమా యూనిట్ ను తిట్టుకుంటున్నారు.

First Published:  23 Dec 2019 12:00 AM GMT
Next Story