బాలయ్య హ్యాట్రిక్ కొట్టేశాడుగా!

ఎవరైనా వరుసగా 3 హిట్స్ కొడితే హ్యాట్రిక్ కొట్టాడని అంటారు. బాలయ్య కూడా హ్యాట్రిక్ కొట్టాడు. కాకపోతే హిట్స్ లో కాదు, ఫ్లాపుల్లో. అవును.. ఈ ఏడాది వరుసగా 3 ఫ్లాపులిచ్చి హ్యాట్రిక్ కొట్టాడు బాలయ్య.

ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు కొట్టడం బాలయ్యకు కొత్తేంకాదు. కాకపోతే ఈ ఏడాది బాధాకరమైన విషయం ఏంటంటే.. తండ్రి బయోపిక్ తో కూడా హిట్ కొట్టలేకపోవడం.

ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా చేసి కథానాయకుడు, మహానాయకుడు పేరిట విడుదల చేశాడు బాలయ్య. ఈ ఏడాది ప్రథమార్థంలో వచ్చిన ఈ రెండు సినిమాలు వేటికవే డిజాస్టర్లుగా నిలిచాయి. ఇవి ఏ రేంజ్ ఫ్లాప్స్ అంటే.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ల లిస్ట్ తీస్తే.. టాప్-5లో ఈ రెండు సినిమాలుంటాయి.

అలాంటి రెండు డిజాస్టర్ల తర్వాత ల్యాంగ్ గ్యాప్ తీసుకొని రూలర్ సినిమా చేశాడు బాలయ్య. గతంలో కేఏస్ రవికుమార్ దర్శకత్వంలో చేసిన జైసింహా సినిమా ఓ మోస్తరుగా ఆడడంతో, ఈసారి రూలర్ కూడా హిట్ అవుతుందనుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. వసూళ్లు దారణంగా పడిపోయాయి. ఇవాళ్టి నుంచి సినిమా థియేటర్లలో నిలబడడం కష్టమే. అలా ఈ ఏడాది 3 ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టాడు బాలయ్య.