Telugu Global
CRIME

108 గంట‌లు స‌మాధిలో యువ‌కుడు ? ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే...

సజీవంగా సమాధిలో ఉండొచ్చా…ఉంటే ఎన్నిరోజులు ఉండొచ్చు..ఎలా ఉండొచ్చు…ఈ యోగాన్ని ఎలా సాధించాలి.. భక్తితోనా… స్వశక్తితోనా…అన్నదానికి సమాధానం వెతికేందుకు ఓ యువకుడు సాహసం చేశాడు. ఛత్తీస్‌గఢ్‌ మహాసముద్‌లో చమన్ దాస్ జోషి వయసు 30. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా గడిపే జోషి….సమాధి సాధన చేయాలని సంకల్పించాడు. 2015 నుంచి సమాధి సాధన చేయడం ప్రారంభించాడు. మొదటి ఏడాది 24గంటలు దిగ్విజయంగా పూర్తి చేశాడు. రెండో ఏడాది 48గంటలు..మూడో ఏడాది 72 గంటలు…నాలుగో ఏడాది 96 గంటల పాటు సమాధి […]

108 గంట‌లు స‌మాధిలో యువ‌కుడు ? ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే...
X

సజీవంగా సమాధిలో ఉండొచ్చా…ఉంటే ఎన్నిరోజులు ఉండొచ్చు..ఎలా ఉండొచ్చు…ఈ యోగాన్ని ఎలా సాధించాలి.. భక్తితోనా… స్వశక్తితోనా…అన్నదానికి సమాధానం వెతికేందుకు ఓ యువకుడు సాహసం చేశాడు.

ఛత్తీస్‌గఢ్‌ మహాసముద్‌లో చమన్ దాస్ జోషి వయసు 30. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా గడిపే జోషి….సమాధి సాధన చేయాలని సంకల్పించాడు. 2015 నుంచి సమాధి సాధన చేయడం ప్రారంభించాడు. మొదటి ఏడాది 24గంటలు దిగ్విజయంగా పూర్తి చేశాడు. రెండో ఏడాది 48గంటలు..మూడో ఏడాది 72 గంటలు…నాలుగో ఏడాది 96 గంటల పాటు సమాధి సాధన చేశాడు.

ఓ పద్దతి ప్రకారం సమాధిలోకి వెళ్తూ….తాను చెప్పిన టైమ్‌కు తన సహచరులు సమాధి తీయడం…ప్రతీ సారి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవడం జోషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ సారి గట్టిగా ట్రై చేయాలని భావించాడు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా తన అచీవ్‌మెంట్ ఉండాలని సాధన చేశాడు. అందరిలా కాకుండా….తనకూ ఓ గుర్తింపు ఉండాలని…సమాధి సాధనలో తనను మించిన వాడు ఎవరూ లేడన్న విధంగా చేయాలని అనుకున్నాడు.

ప్రతీ సారి చేసిన విధంగానే ఈసారి 108గంటలు సమాధిలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం నాలుగడుగుల లోతైన గొయ్యి తవ్వాడు. తెల్లని వస్త్రం ధరించి, పూజలు చేసిన అనంతరం ఆ యువకుడు సమాధిలో కూర్చున్నాడు. తరువాత తన అనుచరుతో ఆ గొయ్యిని కర్రలతో మూసివేసి, దానిపై మట్టిపోయాలని చెప్పాడు. అనుకున్నట్లే అనుకున్న సమయానికి అందరికీ అభివాదం చేస్తూ చిరునవ్వుతో సమాధిలోకి వెళ్లాడు. తర్వాత గొయ్యిని కర్రలతో మూసివేసి దానిపై మట్టిపోశారు.

గతంలో జోషి ఇలాంటి సాహసం సక్సెస్‌ఫుల్‌గా ముగించడంతో..ఈసారి కూడా విజయవంతంగా బయటకు వస్తాడని అందరూ భావించారు. జోషి చెప్పిన టైమ్‌కు సహచరులు సమాధిపై ఉన్న మట్టిని కర్రలను తొలగించారు. అయితే లోపల జోషి అచేతన స్థితిలో పడివున్నాడు. వెంటనే అతనిని మహాసముంద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు జోషిని పరీక్షించి, మృతి చెందాడని నిర్థారించారు. ఎప్పుడూ సక్సెస్‌ఫుల్‌గా సజీవంగా బయటకు వచ్చే జోషి..ఈ సారి ప్రాణాలు విడిచాడు. దీంతో అదే సమాధిలో జోషి మృతదేహాన్ని ఖననం చేశారు.

First Published:  22 Dec 2019 10:06 PM GMT
Next Story