Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ పై అందరికీ షాకిచ్చిన రాజమౌళి

రాజమౌళి నిన్న తన అన్న కీరవాణి కొడుకులు తీసిన ‘మత్తు వదలరా’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుర్రాళ్లు అయిన వీళ్లే ఏడాది సినిమా తీస్తే తాను ‘ఆర్ఆర్ఆర్’ ఎన్నేళ్లు తీయాలంటూ నా సినిమాపై పడొద్దని యాంకర్ సుమకు కౌంటర్ ఇచ్చాడు. అయితే రాజమౌళి చేసిన ప్రకటన ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు… యావత్ బాలీవుడ్, కోలీవుడ్ సహా సాధారణ ప్రేక్షకులను కూడా షాక్ కు గురిచేసింది. రాజమౌళి బాహుబలిని […]

ఆర్ఆర్ఆర్ పై అందరికీ షాకిచ్చిన రాజమౌళి
X

రాజమౌళి నిన్న తన అన్న కీరవాణి కొడుకులు తీసిన ‘మత్తు వదలరా’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుర్రాళ్లు అయిన వీళ్లే ఏడాది సినిమా తీస్తే తాను ‘ఆర్ఆర్ఆర్’ ఎన్నేళ్లు తీయాలంటూ నా సినిమాపై పడొద్దని యాంకర్ సుమకు కౌంటర్ ఇచ్చాడు.

అయితే రాజమౌళి చేసిన ప్రకటన ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు… యావత్ బాలీవుడ్, కోలీవుడ్ సహా సాధారణ ప్రేక్షకులను కూడా షాక్ కు గురిచేసింది.

రాజమౌళి బాహుబలిని 5 ఏళ్లు తీశాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీని తొలుత జూలై 30, 2020న దేశంలోని పది భాషలలో రిలీజ్ చేస్తానని ప్రకటించారు.

అయితే తాజా ప్రి రీలీజ్ వేడుకలో లేట్ అవుతుందని స్పష్టమైన హింట్ ఇచ్చాడు. దీంతో ఆర్ఆర్ఆర్ వాయిదా పడడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

ఇక ఇటీవలే ప్రెస్ నోట్ విడుదల చేసిన ఆర్ఆర్ఆర్ టీం కూడా విడుదల తేది జూలై 30ని ప్రస్తావించకుండా 2020లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని ట్విస్ట్ ఇచ్చింది.

దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ మరింత ఆలస్యం కాబోతోందన్న సంకేతాలను రాజమౌళి ఇచ్చారు. ఇదే జరిగితే ప్రేక్షకులతోపాటు సినిమాలు ప్లాన్ చేసుకున్న వారు కూడా ఆర్ఆర్ఆర్ డేట్ తో వెనక్కి ముందుకు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  23 Dec 2019 4:47 AM GMT
Next Story