Telugu Global
NEWS

కేసీఆర్ కు షాక్.... మున్సిపల్ ఎన్నికలపై కోర్టుకు కాంగ్రెస్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను ప్రకటించి సమరోత్సాహంతో ముందుకెళ్తున్న కేసీఆర్ కు ప్రతిపక్ష కాంగ్రెస్ షాకిచ్చింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టుకెక్కింది. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటీషన్ వేసింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించేందుకు ఇటీవలే కేసీఆర్ సర్కారు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ […]

కేసీఆర్ కు షాక్.... మున్సిపల్ ఎన్నికలపై కోర్టుకు కాంగ్రెస్
X

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను ప్రకటించి సమరోత్సాహంతో ముందుకెళ్తున్న కేసీఆర్ కు ప్రతిపక్ష కాంగ్రెస్ షాకిచ్చింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టుకెక్కింది. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటీషన్ వేసింది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించేందుకు ఇటీవలే కేసీఆర్ సర్కారు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

అయితే మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. రిజర్వేషన్లు పూర్తి చేయకుండా ఎన్నికల షెడ్యూల్ నిర్వహించడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. రిజర్వేషన్లు ప్రకటించకపోవడం వల్ల ప్రతిపక్షాలకు చెందిన వారు అభ్యర్థులను ఎంపిక చేయకుండా… టీఆర్ ఎస్ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ కు అనుకూలంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఉందని స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేయడంతో ఎన్నికలపై కేసీఆర్ సర్కారుకు కోర్టులో ఎలాంటి షాక్ తగలనుందనేది ఆసక్తిగా మారింది.

First Published:  24 Dec 2019 3:48 AM GMT
Next Story