టాప్-10 కోలీవుడ్ ధనవంతులు వీళ్లే!

ఇండియాలో ధనవంతుల జాబితాను ఇప్పటికే ప్రకటించింది ఫోర్బ్స్ సంస్థ. ముఖేష్ అంబానీ నంబర్ వన్ స్థానంలో నిలవగా.. ఇండియా నుంచి బిలియనీర్ల సంఖ్య 20శాతం పెరిగినట్టు ఆ సంస్థ ప్రకటించింది.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఫోర్బ్స్ మరో ఇంట్రెస్టింగ్ సర్వే చేసింది. సినీప్రముఖుల్లో ధనవంతులు ఎవరనే విషయంపై ఆరా తీసింది. ఇందులో భాగంగా కోలీవుడ్ టాప్-10 ధనవంతుల లిస్ట్ తయారుచేసింది.

అందరూ ఊహించినట్టుగానే కోలీవుడ్ ధనవంతుల్లో అందరికంటే ముందు రజనీకాంత్ ఉన్నాడు. 2019లో రజనీకాంత్ ఆదాయం అక్షరాలా వంద కోట్లు. రజనీకాంత్ తర్వాత స్థానంలో ఏఆర్ రెహ్మాన్ నిలిచాడు. ఇతడు 2019లో 94.8 కోట్ల ఆదాయం సంపాదించినట్టు ఫోర్బ్స్ ప్రకటించింది. ఇక మూడో స్థానంలో ఏడాదికి 40 కోట్ల రూపాయల సంపాదనతో అజిత్ మూడో స్థానంలో నిలిచాడు.

కోలీవుడ్ టాప్-10 ధనవంతుల జాబితా (2019 సంపాదన)

1. రజనీకాంత్ – రూ. 100 కోట్లు
2. ఏఆర్ రెహ్మాన్ – రూ. 94.8 కోట్లు
3. అజిత్ – రూ. 40.5 కోట్లు
4. కమల్ హాసన్ – రూ. 34 కోట్లు
5. ధనుష్ – రూ. 31.8 కోట్లు
6. శంకర్ – రూ. 31.5 కోట్లు
7. విజయ్ – రూ. 30 కోట్లు
8. కార్తీక్ సుబ్బరాజ్ – రూ. 13.50 కోట్లు
9. డైరక్టర్ శివ – రూ. 12.2 కోట్లు
10. సూర్య – రూ. 12 కోట్లు