Telugu Global
NEWS

రాజ‌ధాని ప్రాంత వైసీపీ నేత‌ల భేటీ.... రైతుల ఆందోళ‌న‌పై చ‌ర్చ !

ఏపీ కేబినెట్ స‌మావేశం రేపు జ‌ర‌గ‌బోతుంది. రాజ‌ధానితో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌బోతుంది. జీఎన్‌రావు క‌మిటీ ఇచ్చిన నివేదిక‌పై కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. దీంతో పాటు రాజ‌ధాని ప్రాంత రైతుల ఆందోళ‌న‌, అమ‌రావ‌తికి రైతులు ఇచ్చిన భూముల‌పై కూడా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఏపీ కేబినెట్ స‌మావేశం నేప‌థ్యంలో రాజధాని ప్రాంత వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల సమావేశం ఇవాళ జ‌ర‌గ‌బోతుంది. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 3:30 గంటలకు సమావేశం ప్రారంభ‌మవుతుంది. […]

రాజ‌ధాని ప్రాంత వైసీపీ నేత‌ల భేటీ.... రైతుల ఆందోళ‌న‌పై చ‌ర్చ !
X

ఏపీ కేబినెట్ స‌మావేశం రేపు జ‌ర‌గ‌బోతుంది. రాజ‌ధానితో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌బోతుంది. జీఎన్‌రావు క‌మిటీ ఇచ్చిన నివేదిక‌పై కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. దీంతో పాటు రాజ‌ధాని ప్రాంత రైతుల ఆందోళ‌న‌, అమ‌రావ‌తికి రైతులు ఇచ్చిన భూముల‌పై కూడా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది.

ఏపీ కేబినెట్ స‌మావేశం నేప‌థ్యంలో రాజధాని ప్రాంత వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల సమావేశం ఇవాళ జ‌ర‌గ‌బోతుంది. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 3:30 గంటలకు సమావేశం ప్రారంభ‌మవుతుంది. 3 రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళనపై ప్ర‌జాప్ర‌తినిధుల మ‌ధ్య చ‌ర్చ జరుగుతుంది.

రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలపై కూడా చర్చ జరిగే అవ‌కాశం ఉంది. రాజ‌ధాని ప్రాంత రైతుల్లో నెల‌కొన్న ఆందోళ‌న‌ను తొలగించేందుకు ఈ స‌మావేశం ఏర్పాటు చేశార‌ని తెలుస్తోంది. రైతులకు భరోసా ఇచ్చేందుకే ఈ మీటింగ్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత ప్రభుత్వ ప్రణాళికలను వైసీపీ నేత‌లు వివ‌రిస్తార‌ని స‌మాచారం.

మొత్తానికి అమ‌రావ‌తి ప్రణాళిక‌లు, భూములు ఇచ్చిన రైతులు కోరుకుంటున్న అంశాలేమిటి? అనే విష‌యాల‌ను కూడా ఈ మీటింగ్‌లో చర్చిస్తార‌ని తెలుస్తోంది.

First Published:  25 Dec 2019 11:27 PM GMT
Next Story