Telugu Global
NEWS

ఐపీఎల్ డబ్బుతో కమిన్స్ గాళ్ ఫ్రెండ్ కుక్కకు ఆటబొమ్మలు

గాల్లో తేలిపోతున్న కంగారూ ఫాస్ట్ బౌలర్ 15 కోట్ల 50 లక్షల ధర పలికిన ప్యాట్రిక్ కమిన్స్ ప్రపంచ నంబర్ వన్ బౌలర్, ఐపీఎల్ 2020 వేలంలో రికార్డు ధర సొంతం చేసుకొన్న ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్, అతని స్నేహితురాలు బెకీ బోస్టన్ గాల్లో తెలిపోతున్నారు. కోల్ కతాలో ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో కమిన్స్ ను 15 కోట్ల 50 లక్షల రూపాయల రికార్డు ధరకు కోల్ కతా ఫ్రాంచైజీ సొంతం చేసుకొంది. ఐపీఎల్ […]

ఐపీఎల్ డబ్బుతో కమిన్స్ గాళ్ ఫ్రెండ్ కుక్కకు ఆటబొమ్మలు
X
  • గాల్లో తేలిపోతున్న కంగారూ ఫాస్ట్ బౌలర్
  • 15 కోట్ల 50 లక్షల ధర పలికిన ప్యాట్రిక్ కమిన్స్

ప్రపంచ నంబర్ వన్ బౌలర్, ఐపీఎల్ 2020 వేలంలో రికార్డు ధర సొంతం చేసుకొన్న ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్, అతని స్నేహితురాలు బెకీ బోస్టన్ గాల్లో తెలిపోతున్నారు.

కోల్ కతాలో ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో కమిన్స్ ను 15 కోట్ల 50 లక్షల రూపాయల రికార్డు ధరకు కోల్ కతా ఫ్రాంచైజీ సొంతం చేసుకొంది.

ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత ధర దకించుకొన్న విదేశీ క్రికెటర్ గా పాట్ కమిన్స్ నిలిచాడు. గతంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పేరుతో ఉన్న 14 కోట్ల 50 లక్షల రూపాయల ధర రికార్డును పాట్ కమిన్స్ తెరమరుగు చేశాడు.

ఐపీఎల్ డబ్బుతో కుక్కకు ఆటబొమ్మలు..

ఐపీఎల్ ద్వారా తనకు తగిలిన జాక్ పాట్ డబ్బులో కొంతభాగాన్ని తన గాళ్ ఫ్రెండ్ బెకీ బోస్టన్ తన పెంపుడు కుక్కలకు ఆట బొమ్మలు కొనివ్వటానికి కేటాయించినట్లు కమిన్స్ ప్రకటించాడు.

అంతర్జాతీయ క్రికెట్లో గత ఏడాది కాలంలో అత్యుత్తమంగా రాణించడం ద్వారా టెస్ట్ క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ బౌలర్ గా నిలిచిన కమిన్స్ కు అత్యంత ప్రమాదకరమైన బౌలర్ గా పేరుంది.

గంటకు 150 కిలోమీటర్ల సగటు వేగంతో బ్యాట్స్ మన్ సహనానికి పరీక్ష పెట్టడమే కాదు… బోల్తా కొట్టించడంలో తనకుతానే సాటిగా నిలిచే కమిన్స్ కోసం… ఐపీఎల్ ఫ్రాంచైజీలు వెంటపడ్డాయి.

చివరకు కోల్ కతా ఫ్రాంచైజీ రికార్డు ధరకు సొంతం చేసుకోగలిగింది. 2014 ఐపీఎల్ సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ కు తొలిసారిగా ప్రాతినిథ్యం వహించిన కమిన్స్ కు ఆ తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరపునా ఆడిన అనుభవం ఉంది.

26 సంవత్సరాల కమిన్స్ కు 16 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి…17 వికెట్లు పడగొట్టిన రికార్డు మాత్రమే ఉంది. అత్యుత్తమంగా ఓ మ్యాచ్ లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు.

First Published:  25 Dec 2019 11:10 PM GMT
Next Story