Telugu Global
NEWS

రవిచంద్రన్ అశ్విన్ కు దాదా హ్యాట్సాఫ్

గత పదేళ్ళుగా ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్ అశ్విన్ భారత జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత టెస్ట్ విజయాలలో ప్రధానపాత్ర వహించిన అశ్విన్ కు రావాల్సినంత పేరు, గుర్తింపు రాలేదంటూ విచారం వ్యక్తం చేశాడు. గత పది సంవత్సరాల కాలంలో అత్యుత్తమంగా రాణించిన ప్రపంచ నంబర్ వన్ స్పిన్నర్ అశ్విన్ కు సౌరవ్ గంగూలీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపాడు. 2010 నుంచి 2019 వరకూ … పదేళ్ల […]

రవిచంద్రన్ అశ్విన్ కు దాదా హ్యాట్సాఫ్
X
  • గత పదేళ్ళుగా ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్ అశ్విన్

భారత జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత టెస్ట్ విజయాలలో ప్రధానపాత్ర వహించిన అశ్విన్ కు రావాల్సినంత పేరు, గుర్తింపు రాలేదంటూ విచారం వ్యక్తం చేశాడు.

గత పది సంవత్సరాల కాలంలో అత్యుత్తమంగా రాణించిన ప్రపంచ నంబర్ వన్ స్పిన్నర్ అశ్విన్ కు సౌరవ్ గంగూలీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపాడు.

2010 నుంచి 2019 వరకూ …

పదేళ్ల క్రితం టెస్ట్ అరంగేట్రం చేసిన అశ్విన్ 564 వికెట్లు పడగొట్టడం ద్వారా ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ బౌలర్ల జాబితా అగ్రస్థానంలో నిలిచాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలో అశ్విన్ 564 వికెట్లు సాధించడం ద్వారా గత దశాబ్దకాలంలో బౌలర్ నంబర్ వన్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల జోడీ జిమ్మీ యాండర్సన్ 535, స్టువర్ట్ బ్రాడ్ 525 అశ్విన్ తర్వాతి స్థానంలో నిలిచారు. న్యూజిలాండ్ జంట ఫాస్ట్ బౌలర్లు టిమ్ సౌథీ 472, ట్రెంట్ బౌల్ట్ 458 వికెట్లతో నాలుగు, ఐదు స్థానాలలో ఉన్నారు.

ప్రపంచ క్రికెట్లో నే గత దశాబ్దకాలంలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఏకైక స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే నిలవడం విశేషం.

140 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 50, 100, 200, 300, 350 వికెట్ల మైలురాయిని చేరిన ఏకైక బౌలర్ గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు.

First Published:  25 Dec 2019 11:20 PM GMT
Next Story