Telugu Global
NEWS

150 టెస్టులో తొలిబంతికే వికెట్

ఇంగ్లండ్ పేసర్ యాండర్సన్ అరుదైన ఘనత ఇంగ్లండ్ ఎవర్ గ్రీన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ 150 టెస్టులు ఆడిన అరుదైన క్రికెటర్ ఘనతను సొంతం చేసుకొన్నాడు. అంతేకాదు… తన రికార్డు టెస్ట్ మ్యాచ్ తొలిబంతికే వికెట్ పడగొట్టిన మొనగాడిగా నిలిచాడు. గాయంతో గత కొద్దిమాసాలుగా క్రికెట్ కు దూరమై పునరావాస కార్యక్రమాలతో తిరిగి పూర్తి ఫిట్ నెస్ సాధించిన యాండర్సన్ తన కెరియర్ లో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడటం ద్వారా గతంలో ఇదే ఘనత సాధించిన మాస్టర్ […]

150 టెస్టులో తొలిబంతికే వికెట్
X
  • ఇంగ్లండ్ పేసర్ యాండర్సన్ అరుదైన ఘనత

ఇంగ్లండ్ ఎవర్ గ్రీన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ 150 టెస్టులు ఆడిన అరుదైన క్రికెటర్ ఘనతను సొంతం చేసుకొన్నాడు. అంతేకాదు… తన రికార్డు టెస్ట్ మ్యాచ్ తొలిబంతికే వికెట్ పడగొట్టిన మొనగాడిగా నిలిచాడు.

గాయంతో గత కొద్దిమాసాలుగా క్రికెట్ కు దూరమై పునరావాస కార్యక్రమాలతో తిరిగి పూర్తి ఫిట్ నెస్ సాధించిన యాండర్సన్ తన కెరియర్ లో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడటం ద్వారా గతంలో ఇదే ఘనత సాధించిన మాస్టర్ సచిన్, స్టీవ్ వా, జాక్ కలిస్ తో సహా మరో తొమ్మిదిమంది దిగ్గజ క్రికెటర్ల సరసన చోటు సంపాదించాడు.

సౌతాఫ్రికాతో సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ద్వారా జిమ్మీ యాండరన్స్ రీ-ఎంట్రీ చేశాడు.

తన 150వ టెస్ట్ క్యాప్ ను మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ చేతుల మీదుగా అందుకొన్నాడు.

అంతేకాదు టెస్ట్ తొలబంతికే సఫారీ ఓపెనర్ డీన్ ఎల్గర్ ను డకౌట్ గా పడగొట్టాడు. 150 వ టెస్టు తొలి బంతికే వికెట్ పడగొట్టిన తొలిబౌలర్ గా టెస్టు క్రికెట్లో నిలిచిపోయాడు.

సుదీర్ఘ ప్రస్థానం….

2003లో జింబాబ్వే ప్రత్యర్థిగా క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియంలో టెస్ట్ అరంగేట్రం చేసిన యాండర్సన్ గత 16 సంవత్సరాలుగా ఇంగ్లండ్ తరపున టెస్ట్ మ్యాచ్ లు ఆడుతూనే వస్తున్నాడు. 37 సంవత్సరాల జేమ్స్ యాండర్సన్ కు 149 టెస్టుల్లో 575 వికెట్లు సాధించిన ఘనత ఉంది. ఇంగ్లండ్ టెస్ట్ చరిత్రలోనే అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ కమ్ స్వింగ్ బౌలర్ గా యాండర్సన్ కు గుర్తింపు ఉంది.

దిగ్గజాల సరసన….

టెస్ట్ చరిత్రలో 150కి పైగా మ్యాచ్ లు ఆడిన మాస్టర్ సచిన్ టెండుల్కర్, ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, సఫారీ సూపర్ ఆల్ రౌండర్ జాక్ కలిస్ తో సహా తొమ్మిదిమంది దిగ్గజ క్రికెటర్ల సరసన చేరబోతున్నాడు.

13 దశాబ్దాల టెస్ట్ చరిత్రలో అత్యధికంగా 200 టెస్టులు ఆడిన ప్రపంచ రికార్డు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ పేరుతో మాత్రమే ఉంది.

First Published:  26 Dec 2019 10:17 PM GMT
Next Story