Telugu Global
NEWS

కేసీఆర్ ‘వన భోజనాల’ పాలిటిక్స్....

52రోజుల సుధీర్ఘమైన సమ్మె సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులపై కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఆసమయంలో కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా ఆర్టీసీ కార్మికులు ఆడిపోసుకున్నారు. కానీ ఆ తర్వాత రాళ్లేసిన వారినే ఇంటికి పిలిపించి భోజనం పెట్టి వరాలు కురిపించేసరికి క్షీరాభిషేకాలు చేసి పూలు చల్లిన వ్యవహారమూ చూశాం. కేసీఆర్ కు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలుసు. కడుపుకాలిన వారి ఆకలి తీర్చడం.. మచ్చిక చేసుకోవడం కేసీఆర్ కు తెలిసినంతగా […]

కేసీఆర్ ‘వన భోజనాల’ పాలిటిక్స్....
X

52రోజుల సుధీర్ఘమైన సమ్మె సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులపై కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఆసమయంలో కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా ఆర్టీసీ కార్మికులు ఆడిపోసుకున్నారు. కానీ ఆ తర్వాత రాళ్లేసిన వారినే ఇంటికి పిలిపించి భోజనం పెట్టి వరాలు కురిపించేసరికి క్షీరాభిషేకాలు చేసి పూలు చల్లిన వ్యవహారమూ చూశాం.

కేసీఆర్ కు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలుసు. కడుపుకాలిన వారి ఆకలి తీర్చడం.. మచ్చిక చేసుకోవడం కేసీఆర్ కు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదంటారు. ఎంత పెద్ద అసంతృప్తిని అయినా కేసీఆర్ ఒక్క చర్యతో కూల్ చేయగలరంటారు.

ఈ క్రమంలోనే ఈ శుక్రవారం కేసీఆర్ మరో ప్లాన్ వేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అన్ని డిపోలకు చెందిన 100 మంది ఆర్టీసీ ఉద్యోగులతో వనభోజనాలకు ప్లాన్ చేశారు. శామీర్ పేటలో ఈ వనభోజనం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను మున్సిపల్ ఎన్నికల వేళ ఆకట్టుకోవడానికి.. ఆర్టీసీ సమ్మెతో రగిలిపోయిన వారిని కూల్ చేడానికి ప్రభుత్వం ఈ ప్లాన్ చేసిందట.

ఈ వనభోజనాల్లోనే ముఖ్యమంత్రి ఆదేశానుసారం తయారు చేసిన కార్గో బస్సులు, మొబైల్ టాయిలెట్లను ప్రదర్శించబోతున్నారట. ఉద్యోగుల కోసం కేసీఆర్ చేస్తున్న సేవలను గుర్తు చేసి వారిని మున్సిపల్ ఎన్నికల వేళ మచ్చిక చేసుకునేందుకే ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం.

First Published:  27 Dec 2019 3:38 AM GMT
Next Story