Telugu Global
NEWS

టీడీపీ చానళ్లకు మాత్రమే ప్రవేశం... ప్రాణభయంతో మిగిలిన జర్నలిస్టుల పరుగులు

ఉద్దండరాయునిపాలంలో రైతుల ముసుగులో కొందరు టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. జర్నలిస్టులపై దాడికి దిగారు. ఒక మహిళా జర్నలిస్టుతో పాటు మరో ఇద్దరు జర్నలిస్టులను చుట్టుముట్టి కొట్టారు. మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆందోళన చేస్తున్న వారికి అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడం లేదంటూ పలు చానళ్లపై దాడికి దిగారు. చానళ్ల లోగోలు చేతుల్లో ఉన్న వారిని వెతికిమరీ దాడి చేశారు. దాంతో జర్నలిస్టులు లోగోలను కిందపడేసి పరుగులు తీశారు. దీప్తి అనే మహిళా జర్నలిస్టు అక్కడి […]

టీడీపీ చానళ్లకు మాత్రమే ప్రవేశం... ప్రాణభయంతో మిగిలిన జర్నలిస్టుల పరుగులు
X

ఉద్దండరాయునిపాలంలో రైతుల ముసుగులో కొందరు టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. జర్నలిస్టులపై దాడికి దిగారు. ఒక మహిళా జర్నలిస్టుతో పాటు మరో ఇద్దరు జర్నలిస్టులను చుట్టుముట్టి కొట్టారు. మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆందోళన చేస్తున్న వారికి అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడం లేదంటూ పలు చానళ్లపై దాడికి దిగారు.

చానళ్ల లోగోలు చేతుల్లో ఉన్న వారిని వెతికిమరీ దాడి చేశారు. దాంతో జర్నలిస్టులు లోగోలను కిందపడేసి పరుగులు తీశారు. దీప్తి అనే మహిళా జర్నలిస్టు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు వాహనంలో ఎక్కగానే ఆ వాహనాన్ని ఒకేసారి 40 మంది చుట్టుముట్టారు. పెద్దపెద్ద కర్రలతో బాదారు. దాంతో కారు ధ్వంసం అయిపోయింది. పోలీసులు అతికష్టం మీద ఆమెతో పాటు మరో ఇద్దరిని వాహనం నుంచి బయటకు తీసుకొచ్చారు.

అప్పటికీ వారు శాంతించలేదు. మహిళా జర్నలిస్టు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆందోళనకారులు కేవలం టీడీపీకి అనుకూలంగా ఉండే మూడు చానళ్ల ప్రతినిధులను మినహాయించి … మిగిలిన చానళ్ల ప్రతినిధులపై దాడులకు తెగ్గబడ్డారు. దాంతో ప్రాణభయంతో జర్నలిస్టులు పరుగులు తీశారు.

కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్షను కవర్ చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో జర్నలిస్టులపై దాడి జరిగింది. దాడిలో ముగ్గురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.

First Published:  27 Dec 2019 3:31 AM GMT
Next Story