ఆర్ఆర్ఆర్…. రికార్డుల వేట మొదలు

బాహుబలి లాంటి  సినిమా తీసిన రాజమౌళి చేతిలో రూపుదిద్దుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మీదే ఇప్పుడు అందరూ దృష్టిసారించారు. ఈ సినిమా ఎప్పుడొస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవలే ఆర్ఆర్ఆర్ 70శాతం షూటింగ్ పూర్తి చేశామని యూనిట్ ప్రకటించడంతో అందరూ ఊరట చెందారు. రాజమౌళి పేరే ఇప్పుడు బ్రాండ్ గా మారింది. ఆయన మీద నమ్మకంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఫుల్ బిజినెస్ మొదలైందట.. సినిమా పూర్తి కాకముందే రికార్డుల వేట సాగుతున్నట్టు తెలిసింది.

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా పశ్చిమ గోదావరి హక్కులు ఏకంగా 13 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించిందని ప్రచారం జరుగుతోంది.. ఈ జిల్లా చరిత్రలోనే ఇదే అత్యధిక మొత్తమని చెబుతున్నారు.

ఇక తూర్పుగోదావరి జిల్లాలో 15 కోట్లపైనే ఆర్ఆర్ఆర్ యూనిట్ కు ఆఫర్ ఇచ్చారట.. ఇలా రెండు జిల్లాలలోనే ఏకంగా 28 కోట్ల బిజినెస్ అవ్వడం చూసి చిత్రంపై ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇంకెంత క్రేజ్ ఉంటుందోనన్న ఆసక్తి ఇప్పుడు మొదలైంది.

దేశవ్యాప్తంగా ఇదే క్రేజ్ తో ఆర్ఆర్ఆర్ రికార్డ్ ధరకు అమ్ముడు పోవడం ఖాయమని.. లాభాల పంట పండనుందనే విశ్వాసం యూనిట్ సభ్యులకు కలుగుతోందట.