Telugu Global
NEWS

కాంగ్రెస్ కు తమిళిసై షాక్.... కేసీఆర్ పై బీజేపీ వెనక్కి తగ్గిందా?

దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు ఏకచత్రాధిపత్యంతో దూకుడుగా వ్యవహరించిన బీజేపీకి ఒక్కో రాష్ట్రం చేజారిపోతుంటే ముద్ద దిగడం లేదు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తానన్న బీజేపీకి ఇప్పుడు వరుస ఓటములతో పాత్రమిత్రులను మళ్లీ చేరదీసే ఎత్తుగడ వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కు పక్కలో బల్లెంలా ఉంటుందని.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా.. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న తమిళిసైని ఏరికోరి తీసుకొచ్చి మరీ తెలంగాణ గవర్నర్ గా చేశారు బీజేపీ పెద్దలు.. మొదట కేసీఆర్ తో […]

కాంగ్రెస్ కు తమిళిసై షాక్.... కేసీఆర్ పై బీజేపీ వెనక్కి తగ్గిందా?
X

దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు ఏకచత్రాధిపత్యంతో దూకుడుగా వ్యవహరించిన బీజేపీకి ఒక్కో రాష్ట్రం చేజారిపోతుంటే ముద్ద దిగడం లేదు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తానన్న బీజేపీకి ఇప్పుడు వరుస ఓటములతో పాత్రమిత్రులను మళ్లీ చేరదీసే ఎత్తుగడ వేస్తున్నట్టు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ కు పక్కలో బల్లెంలా ఉంటుందని.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా.. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న తమిళిసైని ఏరికోరి తీసుకొచ్చి మరీ తెలంగాణ గవర్నర్ గా చేశారు బీజేపీ పెద్దలు.. మొదట కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనేలానే రాజకీయం చేశారు తమిళి సై. ఆర్టీసీ సమ్మెలో ఇన్ వాల్వ్ అయ్యి ఏకంగా మంత్రులు, కేసీఆర్ కే షాకిచ్చారు.

తాజాగా ప్రతిపక్ష కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. దీనిపై సీబీఐ విచారణ చేయించాలంటూ గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం అందజేశారు. స్వయంగా ఉత్తమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలంతా కోరినా కూడా తాను సీబీఐకి పంపించకుండా రాష్ట్రానికి చెందిన ఏసీబీకి పంపించానని తమిళి సై ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును తాను కారులో, కాలినడకన చూశానని.. ఇది అద్భుతమని.. తెలంగాణ తాగు, సాగునీటి కొరతను తీరుస్తుందంటూ కాళేశ్వరంకు మద్దతుగా గవర్నర్ మాట్లాడడం సంచలనంగా మారింది..

ఈ పరిణామం కాంగ్రెస్ కు షాక్ లా పరిణమించగా.. అధికార టీఆర్ఎస్ కు ఊరటనిచ్చింది. రాష్ట్రాల్లో వరుసగా ఓటములు.. చేజారుతున్న మిత్రులు, తగ్గుతున్న ప్రభ చూసి కేసీఆర్ లాంటి ప్రాంతీయ మిత్రుడితో శతృత్వం వద్దని బీజేపీ ఇలా గవర్నర్ తమిళిసైతో స్నేహం ఆలపించేలా చేస్తోందన్న వాదన పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.

First Published:  28 Dec 2019 3:10 AM GMT
Next Story