Telugu Global
National

మహారాష్ట్ర కేబినెట్ : అజిత్ పవార్, ఆధిత్యఠాక్రేకు అందలం

అనుకున్నట్టే అయ్యింది. మహారాష్ట్రలో కొలువుదీరిన పొత్తుల శివసేన సర్కారు మంత్రి వర్గ విస్తరణలో మిత్రులైన కాంగ్రెస్, ఎన్సీపీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చింది. బీజేపీతో కాలదన్ని కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. ముఖ్యమంత్రిగా శివసేన అధిపతి ఉద్దవ్ ఠాక్రే ప్రమాణం చేశారు. ఆ సమయంలో కేవలం ఆరుగురితో మాత్రమే ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా సోమవారం కేబినెట్ ను విస్తరించారు. కాంగ్రెస్ నుంచి అశోక్ చవాన్, ఫద్వీ, విజయ్ […]

మహారాష్ట్ర కేబినెట్ : అజిత్ పవార్, ఆధిత్యఠాక్రేకు అందలం
X

అనుకున్నట్టే అయ్యింది. మహారాష్ట్రలో కొలువుదీరిన పొత్తుల శివసేన సర్కారు మంత్రి వర్గ విస్తరణలో మిత్రులైన కాంగ్రెస్, ఎన్సీపీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చింది.

బీజేపీతో కాలదన్ని కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. ముఖ్యమంత్రిగా శివసేన అధిపతి ఉద్దవ్ ఠాక్రే ప్రమాణం చేశారు. ఆ సమయంలో కేవలం ఆరుగురితో మాత్రమే ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా సోమవారం కేబినెట్ ను విస్తరించారు.

కాంగ్రెస్ నుంచి అశోక్ చవాన్, ఫద్వీ, విజయ్ వాడెట్టి, అమిత్ దేశ్ ముఖ్, సునీల్ కేడార్, యశోమతి ఠాకూర్, వర్ష గైక్వాడ్, అస్లాం షేక్, సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్ లను తీసుకొని… మంత్రులుగా సీఎం ఉద్దవ్ ఠాక్రే అవకాశం ఇచ్చారు.

అయితే బీజేపీతో జట్టుకట్టి ఎన్సీపీని చీల్చిన శరద్ పవార్ అన్న కొడుకు, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు అనూహ్యంగా డిప్యూటీ సీఎం పదవి లభించింది. ఫిరాయించినా కూడా తిరిగి తప్పు తెలుసుకొని రావడం.. ఎన్సీపీలో బలమైన నేత కావడంతో అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎంగా శివసేన సీఎం ఉద్దవ్ చేర్చుకున్నారు. సీఎం తర్వాత కీలకమైన హోంమంత్రిత్వ శాఖను అజిత్ పవార్ కు ఇవ్వడం విశేషం.

ఇక శివసేన నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన ఆదిత్య ఠాక్రే కూడా తన తండ్రి కేబినెట్ లో మంత్రిగా చాన్స్ దక్కించుకోవడం విశేషం. ఆదిత్య ఠాక్రేను మంత్రివర్గంలోకి తీసుకొని చిన్న వయసులోనే మంత్రిని చేశారు ఉద్దవ్ ఠాక్రే.

ఇక మరో ముఖ్య నేత ధనుంజయ్ ముండేకు ఆర్థిక, ప్లానింగ్ శాఖలను అప్పజెప్పారు. నీటి పారుదల శాఖ మంత్రి జయంత్ పాటిల్, ఎన్సీపీ నేత చాగం భుజ్ బుల్ కు గ్రామీణాభివృద్ధిశాఖను కేటాయించారు.

వీరే కాదు జితేంద్ర ఆవాద్, రాజు శెట్టి, బచ్చుకదూ లాంటి రైతు ఉద్యమ నేతలకూ మంత్రి పదవులను కేటాయించి ఉద్దవ్ టాక్రే ఆశ్చర్యపరిచాడు.

First Published:  30 Dec 2019 2:08 AM GMT
Next Story