Telugu Global
National

ఢిల్లీ క్రికెట్ సంఘంలో గలాటా

డీడీసీఏని రద్దు చేయాలంటూ గంభీర్ డిమాండ్ ఢిల్లీ అండ్ డిస్ట్ర్రిక్ట్ క్రికెట్ సంఘాన్ని రద్దు చేయాలని మాజీ కెప్టెన్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ డిమాండ్ చేశాడు. ఢిల్లీలో ముగిసిన వార్షిక సర్వసభ్య సమావేశం వైరివర్గాల కుమ్ములాటలు, ఓ ఫార్సులా సాగిందని, ఇది భారత క్రికెట్ కే తలవంపులు తెచ్చిందని.. క్రికెట్ అంటే ఏమాత్రం గౌరవం లేని కొందరు వ్యక్తులు ఢిల్లీ క్రికెట్ సంఘంలో చక్రం తిప్పుతున్నారంటూ గంభీర్ మండిపడ్డాడు. ఢిల్లీ క్రికెట్ సంఘంపై నిషేధం విధించాలంటూ బీసీసీఐ కార్యదర్శి […]

ఢిల్లీ క్రికెట్ సంఘంలో గలాటా
X
  • డీడీసీఏని రద్దు చేయాలంటూ గంభీర్ డిమాండ్

ఢిల్లీ అండ్ డిస్ట్ర్రిక్ట్ క్రికెట్ సంఘాన్ని రద్దు చేయాలని మాజీ కెప్టెన్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ డిమాండ్ చేశాడు. ఢిల్లీలో ముగిసిన వార్షిక సర్వసభ్య సమావేశం వైరివర్గాల కుమ్ములాటలు, ఓ ఫార్సులా సాగిందని, ఇది భారత క్రికెట్ కే తలవంపులు తెచ్చిందని.. క్రికెట్ అంటే ఏమాత్రం గౌరవం లేని కొందరు వ్యక్తులు ఢిల్లీ క్రికెట్ సంఘంలో చక్రం తిప్పుతున్నారంటూ గంభీర్ మండిపడ్డాడు.

ఢిల్లీ క్రికెట్ సంఘంపై నిషేధం విధించాలంటూ బీసీసీఐ కార్యదర్శి జే షా, చైర్మన్ సౌరవ్ గంగూలీకి… సర్వసభ్యసమావేశం వీడియో క్లిప్పింగ్ పంపడం ద్వారా కోరాడు.

ఢిల్లీ క్రికెట్ సంఘంలోని కొందరు కార్యవర్గ సభ్యులు రౌడీల్లా తలపడి ముష్టిఘాతాలు కురిపించుకొన్నారని, పెద్దమనుషుల క్రీడకే అవమానం కలిగించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ, ఓపెనర్ శిఖర్ ధావన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ లాంటి ప్రధాన ఆటగాళ్లంతా ఢిల్లీ క్రికెట్ సంఘం నుంచి భారతజట్టులో చేరినవారే కావడం విశేషం.

First Published:  29 Dec 2019 10:59 PM GMT
Next Story