నేను సినిమా చూశాను…. గర్వంగా ఉంది

సరిలేరు నీకెవ్వరు ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించాడు నిర్మాత అనీల్ సుంకర. మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా ముందుగా తనే ఇంటర్వ్యూ ఇచ్చాడు. సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడమే కాకుండా.. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిందని ప్రకటించాడు.

“నేను నిన్ననే సినిమా చూశాను. బయటికి వచ్చాక చాలా గర్వంగా అన్పించింది. ఇంతవరకూ అనీల్‌ రావిపూడిని ఒక యాంగిల్‌లో చూశారు. ఈ సినిమా విడుదలయ్యాక కంప్లీట్‌గా వేరే లీగ్‌లోకి వెళతారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ వదలకుండా మహేష్‌ లాంటి హీరో ఉన్నప్పుడు ఏమేం చేయగలడో అన్నీ చేశారు.”

ఇలా సినిమాకు మరింత హైప్ ఇచ్చే ప్రయత్నం చేశాడు అనీల్ సుంకర. ఈ సందర్భంగా సినిమాలో మహేష్ పాత్రపై కూడా ఓ చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు. కామెడీ కూడా పక్కా అంటున్నాడు.

“ఈ సినిమాలో మహేష్‌ ఆర్మీ మేజర్‌గా చేస్తున్న విషయం తెల్సిందే. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుండి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకు ఆర్మీ మేజర్‌ అనేది అందరికీ గుర్తుండిపోతుంది. సినిమాలో అది బెస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ ఎపిసోడ్‌. ఫస్టాఫ్‌లో దాదాపు 30 నిమిషాలు ఉంటుంది. థియేటర్‌లో ఆ ఎపిసోడ్‌కి ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు.”

మహేష్-రష్మిక జంటగా నటించిన ఈ సినిమా 11న థియేటర్లలోకి వస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు అనీల్ సుంకరతో పాటు.. దిల్ రాజు, మహేష్ బాబు నిర్మాతలు.