మరో డిఫరెంట్ మూవీలో నిత్యామీనన్

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎలాంటి సినిమాలు చేశామన్నది ముఖ్యం. నిత్యామీనన్ పాలసీ ఇది. అందుకే ఎన్ని అవకాశాలొచ్చినా ఆచితూచి కాల్షీట్లు ఇస్తుందీమె. మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తుంది. మరీ ముఖ్యంగా తన పాత్రకు వెయిట్ ఉన్న కథల్ని మాత్రమే ఎంచుకుంటుంది. ఇందులో భాగంగా చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అర్జున్ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా 1979 లో సాగే పీరియాడిక్ మూవీ రూపొందుతుంది. అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించింది నిత్యామీనన్.

జనతా గ్యారెజ్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని గీతగోవిందం చేసింది నిత్యామీనన్. ఆ మూవీ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఇన్నాళ్లకు ఈ డిఫరెంట్ మూవీతో తెలుగుతెరపైకొస్తోంది. పలు షార్ట్ ఫిలిమ్స్ తీసిన విశ్వక్ కందెరావ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు.