రాజమౌళి కోసం మహేష్ బాబు వేచిచూడడం లేదా?

బాహుబలి తర్వాత దర్శకడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తాజాగా తన అన్న కీరవాణి కొడుకుల సినిమా ప్రమోషనల్ లో ‘మహాభారతం’ మూవీ గురించి కూడా తన ఇష్టాన్ని, ప్రేమను బయటపెట్టాడు.

అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి ఇదివరకే ప్రకటించినట్టుగా మహేష్ బాబుతో ఒక పౌరాణిక చిత్రాన్ని తీస్తారని… లేదా కౌబాయ్ లాంటి కథను తీస్తారని ఆయన అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇక మహేష్ బాబు కూడా రాజమౌళితో సినిమా చేయడానికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ రాజమౌళి ‘మహాభారతం’ సినిమా ప్రకటనతో మహేష్-రాజమౌళి సినిమా నిరవధికంగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజమౌళి ఎప్పుడు కానీ ఒక సినిమాను తీసేటప్పుడు దానిమీదే మొత్తం ఫోకస్ చేస్తాడు. వేరే ప్రాజెక్టు గురించి సినిమా గురించి అస్సలు ఆలోచించరు.. ఇప్పుడు కూడా మహేష్ సినిమా గురించి రాజమౌళి ఆలోచించే అవకాశాలు అస్సలు కనిపించడం లేదు.

ఇదివరకూ రాజమౌళి ఓ సందర్భంలో మహేష్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ‘పర్ ఫెక్ట్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉంటేనే మహేష్ బాబును సంప్రదిస్తానని.. తొందరలేదు ’ అంటూ ముందే చెప్పాడు.

ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి చిత్రం కోసం ఎదురుచూడకుండా ఇతర చిత్రాలను చేస్తే బెటర్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఈ సంక్రాంతికి మహేష్ బాబు తీసుకొస్తున్నారు. ఆయన తదుపరి చిత్రాన్ని ఇంతవరకూ ప్రకటించలేదు.