చిరు సరసన సాయితేజ్ హీరోయిన్

చిరంజీవి సినిమా మెల్లమెల్లగా ఓ షేప్ తీసుకుంటోంది. ఇన్నాళ్లూ స్క్రిప్ట్ వర్క్ మీద ఉన్న కొరటాల, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆర్టిస్టుల్ని ఫైనలైజ్ చేస్తున్నాడు. హీరోయిన్ గా త్రిషను తీసుకున్న కొరటాల.. రెండు కీలక పాత్రల కోసం రావు రమేష్, ప్రకాష్ రాజ్ లను ఎంపిక చేసుకున్నాడు. ఇదే ఊపులో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్ ను కూడా సెలక్ట్ చేశాడు.

అవును.. చిరు-కొరటాల సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ పాటను మణిశర్మ ఆల్రెడీ కంపోజ్ చేసి, రికార్డింగ్ కూడా చేసిపెట్టాడు. ఈ పాటలో చిరు సరసన హీరోయిన్ గా రెజీనాను తీసుకున్నారు. కుదిరితే మొదటి షెడ్యూల్ లోనే ఈ పాట షూటింగ్ పూర్తిచేయాలని అనుకుంటున్నారు.

చిరంజీవి ఖైదీనంబర్150లో లక్ష్మీరాయ్ ఐటెంసాంగ్ చేసింది. ఆ ఒక్క పాటతో ఆమె చాలా పాపులర్ అయింది. ఇప్పుడు రెజీనాకు ఆ అదృష్టం దక్కబోతోందన్నమాట. ఇంతకుముందు సాయితేజ్ సరసన ఆమె 2 సినిమాలు చేసింది. ఇప్పుడు ఏకంగా చిరంజీవితో కలిసి చిందేయబోతోంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న రెజీనాకు ఇది మంచి అవకాశమే అని చెప్పాలి.