మహేష్ కు షాక్ ఇవ్వబోతున్న బన్నీ

సంక్రాంతి సినిమాలకు సంబంధించి మరో భారీ ట్విస్ట్. ఈసారి బన్నీ, మహేష్ కు కాస్త గట్టిగానే షాక్ ఇవ్వబోతున్నాడు. మహేష్ మూవీ కంటే ఒక రోజు ముందే తన సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అంటే, ఇంతకుముందు అనుకుంటున్నట్టు 12న కాకుండా, 10వ తేదీకే వచ్చేయాలనేది బన్నీ ప్లాన్. ఇది నిజంగా మహేష్ కు గట్టి షాక్.

నిజానికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు రెండింటినీ 12కే ప్లాన్ చేశారు. ఇద్దరు హీరోలు పోటాపోటీగా పోస్టర్లు రిలీజ్ చేశారు. ఆ తర్వాత దిల్ రాజు లాంటి పెద్దలు జోక్యం చేసుకొని రాజీ కుదిర్చారు. అలా 11న మహేష్ సినిమా, 12న బన్నీ మూవీ రావడానికి ఒప్పందం కుదిరింది. ఇక అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఆఖరి నిమిషంలో, రిలీజ్ కు సరిగ్గా 12 రోజుల ముందు బన్నీ ఝలక్ ఇచ్చాడు.

తన సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు బన్నీ. మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనేది బన్నీ విశ్వాసం. అలాంటప్పుడు ఓపెనింగ్స్ ఎందుకు మిస్ అవ్వాలనేది బన్నీ ఆలోచన. తనకంటే ఒక రోజు మహేష్ మూవీ వస్తే, ఓపెనింగ్స్ దానికే వెళ్లిపోతాడు. అందుకే మహేష్ మూవీ కంటే ముందే రావాలని టార్గెట్ పెట్టుకున్నాడు బన్నీ.