Telugu Global
NEWS

మరో టీడీపీ ఎమ్మెల్యే జంప్...

టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు టీడీపీకి దాదాపు దూరం జరిగేశారు. చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు. ఆ జాబితాలో గొట్టిపాటి రవి చేరే సూచనలు కనిపిస్తున్నారు. ఆయన త్వరలోనే టీడీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే గొట్టిపాటి టీడీపీని వీడుతారని వైసీపీ ముఖ్యనాయకులు ధృవీకరించినట్టు పత్రిక వెల్లడించింది. 2014లో వైసీపీ తరపున గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. జగన్‌తో చాలా […]

మరో టీడీపీ ఎమ్మెల్యే జంప్...
X

టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు టీడీపీకి దాదాపు దూరం జరిగేశారు. చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు. ఆ జాబితాలో గొట్టిపాటి రవి చేరే సూచనలు కనిపిస్తున్నారు. ఆయన త్వరలోనే టీడీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే గొట్టిపాటి టీడీపీని వీడుతారని వైసీపీ ముఖ్యనాయకులు ధృవీకరించినట్టు పత్రిక వెల్లడించింది.

2014లో వైసీపీ తరపున గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. జగన్‌తో చాలా సన్నిహితంగానే ఉండేవారు. అయితే ఆయన గ్రానైట్ వ్యాపారంపై టీడీపీ ప్రభుత్వం వేధింపులకు దిగడంతో ఆ ఒత్తిడితోనే ఆయన టీడీపీలో చేరారని చెబుతుంటారు. టీడీపీలో చేరినప్పటి నుంచి కూడా గొట్టిపాటి రవికుమార్‌కు… కరణం బలరాంకు మధ్య సయోధ్య కుదరలేదు. మొన్నటి ఎన్నికల్లో అద్దంకి నుంచి గొట్టి పాటి రవి మరోసారి విజయం సాధించారు.

నేరుగా వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి…ఆ పని చేయకుండా… తటస్థ సభ్యుడిగా ఉండేందుకు గొట్టిపాటి రవి సిద్ధమవుతున్నారని సమాచారం. అదే జరిగితే టీడీపీ సంఖ్యాబలం 20కు పడిపోతుంది.

First Published:  1 Jan 2020 1:27 AM GMT
Next Story