Telugu Global
NEWS

సరికొత్త లక్ష్యాలతో 2020 వైపు బుమ్రా చూపు

2019లో యార్కర్ల కింగ్ సూపర్ హిట్ భారత యువఫాస్ట్ బౌలర్, త్రీ-ఇన్-వన్ కింగ్ జస్ ప్రీత్ బుమ్రా కొత్త సంవత్సరం వైపు సరికొత్త లక్ష్యాలతో ఎదురుచూస్తున్నాడు. తన కెరియర్ లో గత సంవత్సరం అత్యంత విజయవంతమైన సంవత్సరమని, ఎన్నో అనుభవాలు, విలువైన పాఠాలు నేర్చుకొనే అవకాశం దక్కిందని, అంచనాలకు మించి రాణించడం తనకు సంతృప్తినిచ్చిందని ప్రకటించాడు. గాయంతో గత కొద్దిమాసాలుగా ఆటకు దూరమైన బుమ్రా…శ్రీలంకతో జనవరి 5న ప్రారంభమయ్యే టీ-20 సిరీస్ తో కొత్తసంవత్సరంలో 2020 సీజన్ ను ప్రారంభించబోతున్నాడు. […]

సరికొత్త లక్ష్యాలతో 2020 వైపు బుమ్రా చూపు
X
  • 2019లో యార్కర్ల కింగ్ సూపర్ హిట్

భారత యువఫాస్ట్ బౌలర్, త్రీ-ఇన్-వన్ కింగ్ జస్ ప్రీత్ బుమ్రా కొత్త సంవత్సరం వైపు సరికొత్త లక్ష్యాలతో ఎదురుచూస్తున్నాడు.

తన కెరియర్ లో గత సంవత్సరం అత్యంత విజయవంతమైన సంవత్సరమని, ఎన్నో అనుభవాలు, విలువైన పాఠాలు నేర్చుకొనే అవకాశం దక్కిందని, అంచనాలకు మించి రాణించడం తనకు సంతృప్తినిచ్చిందని ప్రకటించాడు.

గాయంతో గత కొద్దిమాసాలుగా ఆటకు దూరమైన బుమ్రా…శ్రీలంకతో జనవరి 5న ప్రారంభమయ్యే టీ-20 సిరీస్ తో కొత్తసంవత్సరంలో 2020 సీజన్ ను ప్రారంభించబోతున్నాడు.

అరుదైన బౌలర్ బుమ్రా…

ప్రపంచం క్రికెట్లోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ గా భారత్ పేరుపొందడంలో జస్ ప్రీత్ బుమ్రా తనవంతు పాత్ర నిర్వర్తించాడు. మెరుపువేగానికి పదునైన యార్కర్లను జోడించడం ద్వారా అత్యంత ప్రమాదకరమైన బౌలర్ గా, మ్యాచ్ విన్నర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడమే కాదు..ఇన్ స్వింగింగ్, అవుట్ స్వింగింగ్ యార్కర్లతో ప్రత్యర్థిజట్ల బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలు చేయడంలో బుమ్రా తనకుతానే సాటిగా నిలిచాడు.

ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై చిత్తు చేసి భారతజట్టు మొట్టమొదటిసారిగా టెస్ట్ సిరీస్ నెగ్గడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు.

త్రీ-ఇన్-వన్ ఫాస్ట్ బౌలర్….

2019 క్రికెట్ సీజన్లో బుమ్రా 3-ఇన్-1 బౌలర్ గా తన ప్రతిభను పూర్తిస్థాయిలో నిరూపించుకోగలిగాడు. వన్డే క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్, టెస్ట్ క్రికెట్లో ఆరో నంబర్ ర్యాంక్ బౌలర్ గా నిలిచాడు.

గత సీజన్లో ఆడిన12 టెస్టుల్లో 62 వికెట్లు, 58 వన్డేల్లో 103 వికెట్లు, 42 టీ-20 మ్యాచ్ ల్లో 51 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవడంలో బుమ్రా తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

మొత్తం మీద…2019 సీజన్లో ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో తానూ ఒకడినని జస్ ప్రీత్ బుమ్రా నిరూపించుకోగలిగాడు.

First Published:  31 Dec 2019 10:12 PM GMT
Next Story