Telugu Global
NEWS

క్రీడాదిగ్గజాల కొత్త సంవత్సరం వేడుకలు

అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన స్టార్లు భారత క్రీడా ప్రముఖులు కొత్త సంవత్సరం వేడుకలను తమదైన శైలిలో…. స్థాయికి తగ్గట్టుగా జరుపుకొన్నారు. దేశ విదేశాలలోని తమతమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2020 లో తాము మరింత అత్యుత్తమంగా రాణించడానికి సిద్ధమని ప్రకటించారు. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తన భార్య అనుష్కతో కలసి స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్స్ పర్వత విడిది కేంద్రంలో కొత్తసంవత్సరం వేడుకులు జరుపుకొన్నాడు. 2019 క్రికెట్ సీజన్ ను తాను వ్యక్తిగతంగా, భారతజట్టు కెప్టెన్ […]

క్రీడాదిగ్గజాల కొత్త సంవత్సరం వేడుకలు
X
  • అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన స్టార్లు

భారత క్రీడా ప్రముఖులు కొత్త సంవత్సరం వేడుకలను తమదైన శైలిలో…. స్థాయికి తగ్గట్టుగా జరుపుకొన్నారు. దేశ విదేశాలలోని తమతమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2020 లో తాము మరింత అత్యుత్తమంగా రాణించడానికి సిద్ధమని ప్రకటించారు.

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తన భార్య అనుష్కతో కలసి స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్స్ పర్వత విడిది కేంద్రంలో కొత్తసంవత్సరం వేడుకులు జరుపుకొన్నాడు.

2019 క్రికెట్ సీజన్ ను తాను వ్యక్తిగతంగా, భారతజట్టు కెప్టెన్ గా అత్యంత విజయవంతమైనదిగా భావిస్తున్నట్లు అభిమానులకు తెలిపాడు. 2020 సీజన్లో సైతం ఇదేజోరు కొనసాగించగలమన్న ధీమాను వ్యక్తం చేశాడు.

ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే 2020 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా జనవరి 5 నుంచి శ్రీలంకతో సిరీస్, ఆ తర్వాత ఆస్ట్ర్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా 5 మ్యాచ్ ల టీ-20, ఐసీసీ టెస్ట్ లీగ్, వన్డే సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్టుకు కొహ్లీ నాయకత్వం వహించనున్నాడు.

రవిశాస్త్రి హ్యాపీ న్యూఇయర్…

భారత క్రికెట్ చీఫ్ కోచ్ రవిశాస్త్రి సైతం కొత్తసంవత్సరాన్ని సరికొత్తగా గడిపాడు. భారత క్రికెట్ అభిమానులకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు.

భారత జట్టు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన క్రికెట్ కు ప్రాధాన్యమిస్తుందని ప్రకటించాడు. భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్, బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు, డబుల్స్ స్పెషలిస్ట్ అశ్వనీ పొన్నప్ప సైతం అభిమానులకు నూతన సంవత్సర
శుభాకాంక్షలు తెలిపారు.

First Published:  31 Dec 2019 10:18 PM GMT
Next Story