Telugu Global
Cinema & Entertainment

రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ

బన్నీ-మహేష్ మధ్య మరోసారి పోటీ మొదలైందని అంతా అనుకున్నారు. అనుకున్న తేదీ 12న కాకుండా.. 2 రోజుల ముందే అంటే 10వ తేదీకే బన్నీ సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రచారం జరిగింది. అదే కనుక జరిగితే, మహేష్ కూడా తగ్గడని, తన సినిమాను కూడా 10వ తేదీకే విడుదల చేస్తాడంటూ ప్రచారం కూడా సాగింది. ఎట్టకేలకు ఈ వివాదం సమసిపోయింది. ఇంతకుముందు అనుకున్న తేదీలకే రెండు సినిమాలూ వస్తున్నాయి. బన్నీ సినిమా ఇంతకుముందు ప్రకటించినట్టుగానే 12వ తేదీనే […]

రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ
X

బన్నీ-మహేష్ మధ్య మరోసారి పోటీ మొదలైందని అంతా అనుకున్నారు. అనుకున్న తేదీ 12న కాకుండా.. 2 రోజుల ముందే అంటే 10వ తేదీకే బన్నీ సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రచారం జరిగింది. అదే కనుక జరిగితే, మహేష్ కూడా తగ్గడని, తన సినిమాను కూడా 10వ తేదీకే విడుదల చేస్తాడంటూ ప్రచారం కూడా సాగింది. ఎట్టకేలకు ఈ వివాదం సమసిపోయింది. ఇంతకుముందు అనుకున్న తేదీలకే రెండు సినిమాలూ వస్తున్నాయి.

బన్నీ సినిమా ఇంతకుముందు ప్రకటించినట్టుగానే 12వ తేదీనే వస్తుంది. ఈ మేరకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందింది. ముందుగా ఈ విషయాన్ని చెప్పాలంటే ఓవర్సీస్ బయ్యర్లకే. ఎందుకంటే అక్కడి ప్రేక్షకులకు అడ్వాన్స్ బుకింగ్ 2 వారాల ముందే మొదలవుతుంది. ఇందులో భాగంగా దాదాపు 10వేల మందికి పైగా ఆడియన్స్, ఆల్రెడీ టిక్కెట్లు తీసేసుకున్నారు. పైగా యూఎస్ లో 11వ తేదీకే సినిమా ప్రీమియర్లు పడతాయి. సో..ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు ముందుగా వాళ్లకు సమాచారం అందించారు. అలా బన్నీ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది.

నిజానికి ఈ రెండు సినిమాలు 12వ తేదీకే థియేటర్లలోకి రావాలి. కానీ దిల్ రాజు చొరవ తీసుకొని మహేష్ మూవీ ఒక రోజు ముందు వచ్చేలా ప్లాన్ చేశాడు. అలా అంతా సెట్ అయిందనుకున్న టైమ్ కు బన్నీ మూవీ 10వ తేదీకే వస్తుందంటూ ప్రచారం జరగడంతో గందరగోళం నెలకొంది. ఇప్పుడు అది కూడా క్లియర్ అయింది.

First Published:  2 Jan 2020 12:18 AM GMT
Next Story