Telugu Global
NEWS

బాబు ఆవేదన.... కమ్మ జనాభే లేదట

మొన్నటి ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడి సామాజికవర్గం నాయకుల ఆధిపత్యం, ద్వేషపూరిత వ్యాఖ్యల వల్లే ఇతర కులాల వారిలో ఆగ్రహం పెల్లుబుకి చంద్రబాబు ఓడిపోయారని.. ఇది ఓ కారణమన్న వాదన వినిపించింది. తాజాగా అమరావతిలో పర్యటించిన చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిని కమ్మ నగరంగా ముద్రవేస్తున్నారని.. కులం పేరుతో విద్వేషం సృష్టిస్తున్నారని… చంద్రబాబు పర్యటించిన ఎర్రబాలెం గ్రామంలో మొత్తం 8000 జనాభా ఉంటే కేవలం 100 మంది మాత్రమే కమ్మవారు ఉన్నారని కులాల వారీగా లెక్కలు […]

బాబు ఆవేదన.... కమ్మ జనాభే లేదట
X

మొన్నటి ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడి సామాజికవర్గం నాయకుల ఆధిపత్యం, ద్వేషపూరిత వ్యాఖ్యల వల్లే ఇతర కులాల వారిలో ఆగ్రహం పెల్లుబుకి చంద్రబాబు ఓడిపోయారని.. ఇది ఓ కారణమన్న వాదన వినిపించింది.

తాజాగా అమరావతిలో పర్యటించిన చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిని కమ్మ నగరంగా ముద్రవేస్తున్నారని.. కులం పేరుతో విద్వేషం సృష్టిస్తున్నారని… చంద్రబాబు పర్యటించిన ఎర్రబాలెం గ్రామంలో మొత్తం 8000 జనాభా ఉంటే కేవలం 100 మంది మాత్రమే కమ్మవారు ఉన్నారని కులాల వారీగా లెక్కలు చెప్పారు బాబు. కాపులు, బ్రాహ్మాణులు, పద్మశాలి కులస్తులు 1500 చొప్పున ఉన్నారన్నారు.

ఇక అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఎస్సీ జనాభా అత్యధికంగా ఉందని.. కానీ వైసీపీ వారు మాత్రం కమ్మ నగరంగా పేర్కొంటున్నారన్నారు చంద్రబాబు.

అయితే బాబు గమనించని విషయం ఏంటంటే అమరావతిలో తక్కువ సంఖ్యలో కమ్మ వారు ఉన్నప్పటికీ…. గత ఐదేళ్లలో ఇతర కులాలపై వారే ఆధిపత్యం చెలాయించారు, కేసులు పెట్టారు. అమరావతిలోని 29 గ్రామాల్లో ఎక్కువ భూములను కలిగి ఉంది కమ్మ వారేనని వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. తద్వారా బలమైన ఆర్థిక వనరుగా ఉండి శాసించే స్థాయిలో ఉంది ఈ సామాజిక వర్గమే.

రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని విపరీతంగా భూములు కొన్నారు. రాజధానిపై పట్టును పెంచుకున్నారు. ఆధిపత్యం చెలాయించారు. అందువల్లే ఇతర కులాల వారు ఈ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పోరాడారు. చంద్రబాబు జనాభాను బట్టి కమ్మ వాళ్లు తక్కువ అని చెప్పే బదులు…. వారి ఆధిపత్యాన్ని చూసి మాట్లాడితే మంచిదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

First Published:  2 Jan 2020 2:36 AM GMT
Next Story