మిస్టరీ వీడని డాక్టర్ల అదృశ్యం !

దేశరాజధాని ఢిల్లీలో ఇద్దరు తెలుగు డాక్టర్ల అదృశ్యం కేసు పెద్ద మిస్టరీగా మారింది. ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యమై 5 రోజులైంది. అంతుచిక్కని ఈ మిస్టరీలో పోలీసులకు క్లూగా సీసీ టీవీ ఫుటేజీ ఒక్కటే దొరికింది.

ఈ కేసును ఛేదించేంత ఆధారాలు కూడా లేకపోవవడంతో….. ఈ చిన్న లింకుతోనే ఛేదించే పనిలో పడ్డారు. సీసీ ఫుటేజిలో ఇద్దరి చేతిలో బ్యాగ్ ఉంది… అది ఒక్కరిదా.. ఇద్దరూ సర్దుకుని వెళ్లారా? అన్న కోణంలోనూ పరిశీలిస్తున్నారు. వారిని ఎవరైనా ఫాలో అయ్యారా… అక్కడి నుంచి ఎటు వెళ్లారన్నది పరిశీలిస్తున్నారు.

డాక్టర్‌ హిమబిందు, డాక్టర్‌ దిలీప్‌ ఈనెల 25న అదృశ్యమయ్యారు. చర్చికి వెళ్లి వస్తానని చెప్పి హిమబిందు, దిలీప్‌ కన్పించకుండా పోయారు. పోలీసులకు తన భార్య అదృశ్యంపై ఫిర్యాదు చేశారు హిమ బిందు భర్త డాక్టర్‌ శ్రీధర్‌.

కర్నూలు లోని మెడికల్‌ కాలేజీలో డాక్టర్‌ దిలీప్‌, డాక్టర్‌ హిమబిందు, డాక్టర్‌ శ్రీధర్‌ కలిసి చదువుకున్నారు. అయితే క్రిస్మస్‌ నాడు డాక్టర్‌ దిలీప్‌, డాక్టర్‌ హిమబిందు అదృశ్యం కావడం తీవ్ర సంచలనం రేపింది. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మిస్సింగ్‌ అయిన ఇద్దరిలో ఒకరి ఫోన్ కాకపోతే మరొకరిదైనా కలవాలి. కానీ రెండూ స్విచ్చాఫ్ రావడంతో.. పోలీసులకు సవాల్‌గా మారింది. వీరిద్దరూ కలిసి ఎటైనా వెళ్లారని అనుమానించినా…… రూపాయి కూడా వారిపేరుతో ట్రాన్సాక్షన్‌ జరగడం లేదు. కార్డులు స్వైప్‌ కాలేదు. టికెట్లు కొన్నట్టు ఆధారాలు లభించలేదు. ఒకవేళ క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ చేశారని భావించినా వారి వద్ద అంత నగదు లేదని భర్తే చెబుతున్నాడు. మరోవైపు వీరిద్దరి చేతుల్లో లగేజీ కూడా ఉండడంతో ప్రేమ వ్యవహారం కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ వ్యవహారం కాకుంటే… ట్రాఫికింగ్‌ ముఠాల పని అయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాఫికింగ్‌ ముఠా అయితే.. దిలీప్‌ ఏమై ఉంటాడన్న అనుమానం వేధిస్తోంది. ఇద్దరు ఫోన్‌లు తీసుకొని స్విచ్‌ ఆఫ్‌ చేసి..దిలీప్‌కు ఏదైనా హానీ చేసి.. హిమబిందును తీసుకెళ్లారా? అన్న కోణంలోనూ పోలీసులు శోధిస్తున్నారు.

మరోవైపు ఎవరైనా కిడ్నాప్‌ చేశారా? కిడ్నాప్‌ చేసుంటే…కిడ్నాపర్లు ఎంతో కొంత డిమాండ్‌ చేసేవాళ్లు…మరి ఇప్పటివరకు ఆ అప్‌డేట్‌ కూడా లేకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది.