Telugu Global
NEWS

ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు.... కాబోయే సీఎం కేటీఆరే

ఇప్పటికే మంత్రి శ్రీనివాసగౌడ్ రేపిన మాటల వేడి చల్లారలేదు.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తానే తెలంగాణ ముఖ్యమంత్రి అని.. కేటీఆర్ కు ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా… రెస్ట్ తీసుకున్నా… తర్వాత సీఎం కేటీఆరేనని మంత్రి శ్రీనివాసగౌడ్ స్పష్టం చేశారు. దీనిపై ఇంటా బయటా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు మరో గొంతు బయటకు వచ్చింది. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ […]

ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు.... కాబోయే సీఎం కేటీఆరే
X

ఇప్పటికే మంత్రి శ్రీనివాసగౌడ్ రేపిన మాటల వేడి చల్లారలేదు.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తానే తెలంగాణ ముఖ్యమంత్రి అని.. కేటీఆర్ కు ఛాన్స్ లేదని స్పష్టం చేశారు.

అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా… రెస్ట్ తీసుకున్నా… తర్వాత సీఎం కేటీఆరేనని మంత్రి శ్రీనివాసగౌడ్ స్పష్టం చేశారు. దీనిపై ఇంటా బయటా చర్చ జరిగింది.

అయితే ఇప్పుడు మరో గొంతు బయటకు వచ్చింది. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ తర్వాత కేటీఆరే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా… పార్టీని ముందుకుతీసుకెళ్తారని ఆమె కామెంట్ చేశారు.

బుధవారం మహబూబాబాద్ లో గ్రీన్ చాలెంజ్ లో మొక్కలు నాటిన కవిత.. ఈ సందర్భంగా కాబోయే సీఎం కేటీఆర్ అని బహిరంగంగా ప్రకటించడం విశేషం. ఇప్పటికే దీనిపై కేసీఆర్ వివరణ ఇచ్చినా… హరీష్ రావు పోటీ నేపథ్యంలోనే నేతలు వ్యూహాత్మకంగా కేటీఆర్ పేరు తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  2 Jan 2020 2:32 AM GMT
Next Story