Telugu Global
Cinema & Entertainment

జాన్ షూటింగ్ అప్ డేట్స్

ఏడాది కిందట ఆగిపోయిన జాన్ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 7 నెలల కిందటే ఆగిపోయింది. ఇక ఆ సినిమా రాదని అంతా ఫిక్స్ అయిపోయిన టైమ్ లో మరోసారి యూనిట్ నుంచి అప్ డేట్ వచ్చింది. జాన్ షూటింగ్ ఈ వారంలోనే మొదలవుతుంది. సాహోతో పాటు జాన్ షూటింగ్ స్టార్ట్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పారిస్ లో […]

జాన్ షూటింగ్ అప్ డేట్స్
X

ఏడాది కిందట ఆగిపోయిన జాన్ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 7 నెలల కిందటే ఆగిపోయింది. ఇక ఆ సినిమా రాదని అంతా ఫిక్స్ అయిపోయిన టైమ్ లో మరోసారి యూనిట్ నుంచి అప్ డేట్ వచ్చింది. జాన్ షూటింగ్ ఈ వారంలోనే మొదలవుతుంది.

సాహోతో పాటు జాన్ షూటింగ్ స్టార్ట్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పారిస్ లో జరిగింది. ప్రభాస్-పూజా హెగ్డే మధ్య కొన్ని సన్నివేశాలు తీశారు. ఆ షెడ్యూల్ తర్వాత మళ్లీ సినిమా స్టార్ట్ కాలేదు. ప్రభాస్ పూర్తిగా సాహో పనిలో పడిపోయాడు. సాహో రిలీజ్ తర్వాత కూడా జాన్ పై ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో డౌట్స్ పెరిగాయి. దీంతో యూనిట్ అప్ డేట్ ఇచ్చింది.

అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో మరో 4 రోజుల్లో జాన్ సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. కేవలం ప్రభాస్, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులపై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, ఇతర స్టుడియోస్ లో కొన్ని సెట్స్ వేశారు. సినిమా మొత్తాన్ని ఆ సెట్స్ లోనే కంప్లీట్ చేసి, ఈ ఏడాది దసరా నాటికి విడుదల చేయాలనేది ప్లాన్.

First Published:  2 Jan 2020 4:00 AM GMT
Next Story