Telugu Global
NEWS

కొహ్లీ, స్మిత్ లను మించిన మార్నుస్

2019 లో వెయ్యి పరుగుల ఏకైక క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో 2019 సీజన్ ముగిసింది. సరికొత్త సీజన్ కు తెరలేచింది. అయితే…గత ఏడాదికాలంలో క్రికెట్ అత్యుత్తమ ఆటగాడిగా భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ.. టాప్ ర్యాంక్ నిలబెట్టుకొన్న వెయ్యి పరుగుల ఘనతను సాధించలేకపోయాడు. ఈ ఘనతను ఆస్ట్ర్రేలియా యువసంచలనం మార్నుస్ లాబ్ చేంజ్ దక్కించుకొన్నాడు. 2019 సీజన్లో అత్యంత విజయవంతమైన, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మార్నుస్ మొత్తం 11 టెస్టులు 16 ఇన్నింగ్స్ లో 1104 పరుగులతో […]

కొహ్లీ, స్మిత్ లను మించిన మార్నుస్
X
  • 2019 లో వెయ్యి పరుగుల ఏకైక క్రికెటర్

అంతర్జాతీయ క్రికెట్లో 2019 సీజన్ ముగిసింది. సరికొత్త సీజన్ కు తెరలేచింది. అయితే…గత ఏడాదికాలంలో క్రికెట్ అత్యుత్తమ ఆటగాడిగా భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ.. టాప్ ర్యాంక్ నిలబెట్టుకొన్న వెయ్యి పరుగుల ఘనతను సాధించలేకపోయాడు.

ఈ ఘనతను ఆస్ట్ర్రేలియా యువసంచలనం మార్నుస్ లాబ్ చేంజ్ దక్కించుకొన్నాడు. 2019 సీజన్లో అత్యంత విజయవంతమైన, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

మార్నుస్ మొత్తం 11 టెస్టులు 16 ఇన్నింగ్స్ లో 1104 పరుగులతో టాపర్ గా నిలిచాడు. మొత్తం పరుగుల్లో రెండు సిక్సర్లు మాత్రమే ఉండటం విశేషం. ఇందులో మూడు శతకాలు, ఆరు అర్థశతకాలతో పాటు 68.13 సగటు నమోదు చేయగలిగాడు.

రెండోస్థానంలో స్టీవ్ స్మిత్…

టెస్ట్ క్రికెట్ రెండోర్యాంకర్, ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తాను ఆడిన ఏడు టెస్టుల్లోనే మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో సహా 873 పరుగులతో 79.36 సగటు సాధించడం విశేషం. ఏడాది నిషేధం తర్వాత ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ ద్వారా పునరాగమనం చేసిన స్టీవ్ స్మిత్ వరుస సెంచరీలతో పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు.

ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 11 టెస్టుల్లో 2 సెంచరీలతో 774 పరుగులు, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 10 టెస్టుల్లో 2 శతకాలతో 772 పరుగులు, భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 8 టెస్టుల్లోనే 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో సహా 754 పరుగులతో మొదటి ఐదు స్థానాలలో నిలువగలిగారు.

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ 612 పరుగులతో టాప్ రన్ గెటర్స్ లో 7వ స్థానంలో నిలిచాడు. ఈ ఐదుగురు క్రికెటర్లు 2019 టెస్ట్ క్రికెట్ సీజన్ ను అత్యంత విజయవంతంగా ముగించగలిగారు.

First Published:  1 Jan 2020 11:52 PM GMT
Next Story