Telugu Global
Cinema & Entertainment

బన్నీ సినిమా సెన్సార్ పూర్తి

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా నిడివి 156 నిమిషాలు ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా మరో బ్రాండ్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేసింది యూనిట్. కానీ ఆశ్చర్యకరంగా రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. నిజానికి సినిమాలన్నీ సెన్సార్ కోసం ఎదురుచూస్తుంటాయి. ఎప్పుడు సెన్సార్ అయిపోతుందా, వెంటనే విడుదల తేదీని (నిబంధనల […]

బన్నీ సినిమా సెన్సార్ పూర్తి
X

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా నిడివి 156 నిమిషాలు ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా మరో బ్రాండ్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేసింది యూనిట్. కానీ ఆశ్చర్యకరంగా రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు.

నిజానికి సినిమాలన్నీ సెన్సార్ కోసం ఎదురుచూస్తుంటాయి. ఎప్పుడు సెన్సార్ అయిపోతుందా, వెంటనే విడుదల తేదీని (నిబంధనల ప్రకారం) అధికారంగా ప్రకటిద్దాం అని చూస్తుంటాయి. కానీ అల వైకుంఠపురములో సినిమా యూనిట్ మాత్రం ఈ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.

లెక్కప్రకారం ఈ సినిమా 12వ తేదీన రావాలి. మొన్నటివరకు పోస్టర్లలో ఇదే తేదీ కనిపించింది. కానీ ఇప్పుడీ సినిమాను 10వ తేదీకి తీసుకొద్దామనేది ప్లాన్. అలా కుదరకపోతే.. మహేష్ మూవీతో కలిసి 11వ తేదీకే రావాలనేది మరో ఆలోచన. అంతేతప్ప, 12వ తేదీకి మాత్రం రావాలని యూనిట్ కు లేదు. ఇంతకుముందు అనుకున్నట్టు 12వ తేదీకే వస్తే బన్నీ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కడం లేదు. అందుకే యూనిట్ ప్రస్తుతానికి రిలీజ్ డేట్ ప్రకటించలేదు. మరికొన్ని గంటల్లో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది.

First Published:  3 Jan 2020 9:42 AM GMT
Next Story