Telugu Global
National

ఫలించిన విజయసాయిరెడ్డి ప్రయత్నాలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నాలు ఫలించాయి. పాకిస్థాన్‌ చెరలో ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను విడిపించేందుకు విజయసాయిరెడ్డి చేసిన కృషి ఫలించింది. ఈనెల 6న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను విడుదల చేస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. వాఘా సరిహద్దు వద్ద ఉత్తరాంధ్ర జాలర్లను భారత్ అధికారులకు అప్పగిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ఈమేరకు భారత విదేశాంగ శాఖకు పాకిస్థాన్‌ ప్రభుత్వం సమాచారం అందించింది. ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులు పొట్టకూటి కోసం గుజరాత్‌ వలస వెళ్లారు. గుజరాత్‌ […]

ఫలించిన విజయసాయిరెడ్డి ప్రయత్నాలు
X

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నాలు ఫలించాయి. పాకిస్థాన్‌ చెరలో ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను విడిపించేందుకు విజయసాయిరెడ్డి చేసిన కృషి ఫలించింది. ఈనెల 6న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను విడుదల చేస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. వాఘా సరిహద్దు వద్ద ఉత్తరాంధ్ర జాలర్లను భారత్ అధికారులకు అప్పగిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ఈమేరకు భారత విదేశాంగ శాఖకు పాకిస్థాన్‌ ప్రభుత్వం సమాచారం అందించింది.

ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులు పొట్టకూటి కోసం గుజరాత్‌ వలస వెళ్లారు. గుజరాత్‌ వద్ద సముద్రంలో చేపల వేట సాగిస్తున్న సమయంలో మత్స్యకారులు పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించారు. దాంతో వారిని పాకిస్థాన్‌ భద్రతా దళాలు తీసుకెళ్లి జైలులో ఉంచాయి. వారిని విడిపించేందుకు ఆరేడు నెలలుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. వైసీపీ ఎంపీల బృందం కూడా కేంద్ర విదేశాంగ శాఖమంత్రి జైశంకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది.

మత్స్యకారుల అంశంలో క్రమం తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూ విజయసాయిరెడ్డి ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు భారత్‌ ప్రయత్నాలకు పాకిస్థాన్‌ సానుకూలంగా స్పందించింది. మత్స్యకారులను విడుదలు చేస్తున్నట్టు ప్రకటించింది. 20 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారుల జాబితాను కూడా భారత్‌కు అందించింది. పాకిస్థాన్‌కు పట్టపడ్డ మత్స్యకారులు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారు.

First Published:  3 Jan 2020 6:29 AM GMT
Next Story