Telugu Global
Cinema & Entertainment

నాగబాబు కామెంట్స్ పై.... జబర్ధస్త్ టీం కౌంటర్ అటాక్ ఇలా ప్లాన్ చేసింది....

జబర్ధస్త్ ను వీడి సొంత కుంపటి పెట్టి మల్లెమాలపై తీవ్ర విమర్శలు చేసిన మెగా బ్రదర్ నాగబాబును టార్గెట్ చేసింది ఈటీవీ-మల్లెమాల టీం. తాజాగా జీతెలుగులో ‘అదిరింది’ ప్రోగ్రాంను జబర్ధస్త్ కు పోటీగా నిర్వహిస్తున్న నాగబాబు.. ఆ స్కిట్ లలోనూ జబర్దస్త్ ను టార్గెట్ చేస్తున్నారు. జబర్ధస్త్ లో అగ్రిమెంట్ ఉంటుందని… పేమెంట్ ఇవ్వరంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్ధస్త్ ను నిర్వహించే మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా నాగబాబుకు కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఆదివారం రాత్రి 9.30 […]

నాగబాబు కామెంట్స్ పై.... జబర్ధస్త్ టీం కౌంటర్ అటాక్ ఇలా ప్లాన్ చేసింది....
X

జబర్ధస్త్ ను వీడి సొంత కుంపటి పెట్టి మల్లెమాలపై తీవ్ర విమర్శలు చేసిన మెగా బ్రదర్ నాగబాబును టార్గెట్ చేసింది ఈటీవీ-మల్లెమాల టీం.

తాజాగా జీతెలుగులో ‘అదిరింది’ ప్రోగ్రాంను జబర్ధస్త్ కు పోటీగా నిర్వహిస్తున్న నాగబాబు.. ఆ స్కిట్ లలోనూ జబర్దస్త్ ను టార్గెట్ చేస్తున్నారు. జబర్ధస్త్ లో అగ్రిమెంట్ ఉంటుందని… పేమెంట్ ఇవ్వరంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఈ క్రమంలోనే జబర్ధస్త్ ను నిర్వహించే మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా నాగబాబుకు కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది.

ఆదివారం రాత్రి 9.30 గంటలకు జీతెలుగు లో నాగబాబు షో ‘అదిరింది’ ప్రసారమయ్యే సమయంలోనే… ఈటీవీలో పాత జబర్ధస్త్ స్కిట్ లను రీఎడిట్ చేసి స్పైసీగా ఇస్తున్నారు. అడ్వటైజ్ మెంట్లు లేకుండా నాగబాబు కనిపించిన హైలైట్ ఎపిసోడ్ లను ప్రసారం చేస్తూ సవాల్ విసురుతున్నారు.

అయితే నాగబాబు ‘అదిరింది’ షో జబర్ధస్త్ ను పోలి ఉంది. దీంతో ఈ షోపై నెటిజన్ లు కూడా పెదవి విరుస్తున్నారు. జబర్ధస్త్ ను బీట్ చేయలేకపోతోందని కామెంట్స్ చేస్తున్నారు. ‘అదిరింది’ షో పాత చింతకాయ పచ్చడి కాన్సెప్ట్ లతో నడుస్తోందంటున్నారు.

మొత్తానికి నాగబాబు పై…. మల్లెమాల టీం కూడా ఎక్కడా తగ్గకుండా సై అంటే సై అనేస్తూ వేడి పుట్టిస్తున్నారు.

First Published:  3 Jan 2020 12:46 AM GMT
Next Story