Telugu Global
National

రాయపాటిపై ఈడీ కొరడా... రుణం రూ.8,832 కోట్లు, దారి మళ్లించింది రూ. 3,822 కోట్లు

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. రెండు రోజుల క్రితం సీబీఐ ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. రాయపాటితో పాటు ఆయన కుమారుడిపైనా కేసు నమోదు చేశారు. తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. రాయపాటిపై కేసు నమోదు చేసింది. భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించిన ఈడీ ఆ మేరకు కేసులు నమోదు చేసింది. ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ పైనా కేసు నమోదు చేసింది ఈడీ. […]

రాయపాటిపై ఈడీ కొరడా... రుణం రూ.8,832 కోట్లు, దారి మళ్లించింది రూ. 3,822 కోట్లు
X

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. రెండు రోజుల క్రితం సీబీఐ ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. రాయపాటితో పాటు ఆయన కుమారుడిపైనా కేసు నమోదు చేశారు.

తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. రాయపాటిపై కేసు నమోదు చేసింది. భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించిన ఈడీ ఆ మేరకు కేసులు నమోదు చేసింది.

ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ పైనా కేసు నమోదు చేసింది ఈడీ. కోట్లాది రూపాయలను సింగపూర్, మలేషియాకు మనీ లాండరింగ్‌ ద్వారా మళ్లించినట్టు గుర్తించారు. రాయపాటి కంపెనీ 15 బ్యాంకుల నుంచి మొత్తం 8,832 కోట్ల రూపాయల రుణం తీసుకుంది.

ఈ సొమ్ములో ఏకంగా 3వేల 822 కోట్లను రుణం తీసుకున్న అవసరాలకు కాకుండా ఇతర మార్గాల్లో దారి మళ్లించినట్టు గుర్తించింది. ఈ నిధులను సింగపూర్, మలేషియా, రష్యాలకు తరలించినట్టు అభియోగాలు ఉన్నాయి.

First Published:  3 Jan 2020 1:20 AM GMT
Next Story