Telugu Global
NEWS

అమరావతి బంద్... డిఫెన్స్ లో పడిపోయిన చంద్రబాబు

నాడు ఉమ్మడి ఏపీలో రెండు కళ్ల సిద్ధాంతం పేరిట అటు తెలంగాణలో ఒక అడుగు.. ఇటు ఏపీలో మరో అడుగు వేసి తాను అందరి వాడినని చంద్రబాబు చెప్పుకున్నారు. ఇప్పుడు జగన్ విసిరిన 3 రాజధానుల పాచికలో మాత్రం చంద్రబాబు ఒకే కన్నుతో చూస్తున్నారు… చంద్రబాబును ఏపీ సీఎం జగన్ డిఫెన్స్ లోకి నెట్టారు. తాజాగా రాజధానిపై బీసీజీ సంస్థ జగన్ కు నివేదికను అందజేసింది. విశాఖను రాజధానిగా చేస్తే బెటర్ అంటూ నివేదిక ఇచ్చింది. దీంతో […]

అమరావతి బంద్... డిఫెన్స్ లో పడిపోయిన చంద్రబాబు
X

నాడు ఉమ్మడి ఏపీలో రెండు కళ్ల సిద్ధాంతం పేరిట అటు తెలంగాణలో ఒక అడుగు.. ఇటు ఏపీలో మరో అడుగు వేసి తాను అందరి వాడినని చంద్రబాబు చెప్పుకున్నారు. ఇప్పుడు జగన్ విసిరిన 3 రాజధానుల పాచికలో మాత్రం చంద్రబాబు ఒకే కన్నుతో చూస్తున్నారు… చంద్రబాబును ఏపీ సీఎం జగన్ డిఫెన్స్ లోకి నెట్టారు.

తాజాగా రాజధానిపై బీసీజీ సంస్థ జగన్ కు నివేదికను అందజేసింది. విశాఖను రాజధానిగా చేస్తే బెటర్ అంటూ నివేదిక ఇచ్చింది. దీంతో చంద్రబాబు అమరావతి బంద్ కు పిలుపునిచ్చారు.

అయితే ప్రతిపక్షనేత చంద్రబాబు రాష్ట్రానికి నేత..కానీ ఈ బంద్ ను కేవలం అమరావతికే పరిమితం చేసేసి చంద్రబాబు డిఫెన్స్ లో పడిపోయారు. రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తే బాబు బండారం బయటపడిపోతుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసుల నుంచి నిరసన సెగ తగిలేది.

అందుకే తనకూ, తన అనుయాయులకు భూములుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారితోనే అమరావతిలో ఆయన బంద్ చేస్తున్నారు. కేవలం అమరావతిలోని కొన్ని గ్రామాల్లో మాత్రమే బంద్ ను పరిమితం చేశారు.

ఇలా చంద్రబాబు బంద్ పై నాటకం ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది. చంద్రబాబును రాజధానిపై గట్టిగా నిలదీయలేని పరిస్థితిని జగన్ కల్పించినట్లు అయింది.

First Published:  4 Jan 2020 1:16 AM GMT
Next Story