Telugu Global
Cinema & Entertainment

ఈ ఏడాదిలోనే బ్లాక్ బస్టర్ సీక్వెల్

గత సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఎఫ్2 మాత్రమే. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్స్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎఁటర్ టైనర్ గా తెరకెక్కిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ చేస్తామంటూ అప్పట్లోనే యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే, అందులో నటించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెంకీ, వరుణ్ కూడా ప్రకటించారు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. ఈ ఏడాదిలోనే ఎఫ్2కు […]

ఈ ఏడాదిలోనే బ్లాక్ బస్టర్ సీక్వెల్
X

గత సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఎఫ్2 మాత్రమే. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్స్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎఁటర్ టైనర్ గా తెరకెక్కిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ చేస్తామంటూ అప్పట్లోనే యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే, అందులో నటించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెంకీ, వరుణ్ కూడా ప్రకటించారు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది.

ఈ ఏడాదిలోనే ఎఫ్2కు సీక్వెల్ చేయాలని భావిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ మేరకు దర్శకుడు అనీల్ రావిపూడితో దిల్ రాజు చర్చలు పూర్తిచేశాడు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పనుల్లో అనీల్ రావిపూడి బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ ఏ సినిమా చేయబోతున్నాడనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. సో.. అన్నీ అనుకున్నట్టు జరిగితే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఎఫ్2కు సీక్వెల్ చేసే ఛాన్స్ ఉంది.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేష్ ఉంటారు కానీ హీరోయిన్లు మాత్రం మారిపోతారంట. అవును.. తమన్న, మెహ్రీన్ స్థానంలో కొత్త ముద్దుగుమ్మలు వస్తారట. ఫస్ట్ పార్ట్ లో భార్యలుగా కనిపించిన ఈ క్యారెక్టర్లను తీసేసి, కొత్త హీరోయిన్లను ఎలా పెడతారో చూడాలి. ఈ విషయంలో అనిల్ రావిపూడి ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

First Published:  4 Jan 2020 12:00 AM GMT
Next Story