Telugu Global
Cinema & Entertainment

టీ కప్పులో తుపాను సమసిపోయింది

అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాల మధ్య నడిచిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. ఇంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందం తమకు అంగీకారం కాదంటూ బన్నీ బ్యాచ్ తెరపైకి రావడంతో అసలు వివాదం మొదలైంది. దీనికి తోడు తమ సినిమాను మహేష్ మూవీ కంటే ముందే 10వ తేదీకి రిలీజ్ చేస్తామంటూ ఫీలర్లు వదలడంతో మరోసారి రచ్చ రాజుకుంది. ఎట్టకేలకు దిల్ రాజు చొరవతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముగిసింది. ఇంతకుముందు అనుకున్న ప్రకారమే బన్నీ […]

టీ కప్పులో తుపాను సమసిపోయింది
X

అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాల మధ్య నడిచిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. ఇంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందం తమకు అంగీకారం కాదంటూ బన్నీ బ్యాచ్ తెరపైకి రావడంతో అసలు వివాదం మొదలైంది. దీనికి తోడు తమ సినిమాను మహేష్ మూవీ కంటే ముందే 10వ తేదీకి రిలీజ్ చేస్తామంటూ ఫీలర్లు వదలడంతో మరోసారి రచ్చ రాజుకుంది. ఎట్టకేలకు దిల్ రాజు చొరవతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముగిసింది.

ఇంతకుముందు అనుకున్న ప్రకారమే బన్నీ సినిమా 12వ తేదీన, మహేష్ మూవీ 11వ తేదీన థియేటర్లలోకి వస్తాయి. ఇలా జరగడం వల్ల మహేష్ కు కాస్త లాభం ఉంటుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే సమయంలో.. 24 గంటల వ్యవథిలో రాబోతున్న అల వైకుంఠపురములో సినిమాకు ఆ స్థాయిలో ఓపెనింగ్స్ రావు. ఎందుకంటే, అప్పటికే మహేష్ మూవీ థియేటర్లలో ఉంటుంది కాబట్టి.

నిజానికి బన్నీ సినిమా విడుదలయ్యే సమయానికి మహేష్, 40శాతం థియేటర్లు వదులుకోవాల్సి వస్తోంది. అయినప్పటికీ బన్నీకి అది అనుకూలం కాదు. అప్పటికి 20శాతం థియేటర్లు మహేష్ కే అదనంగా దక్కినట్టు అవుతుంది. అందుకే వీలైతే 10నే వస్తామని, లేదంటే రెండు సినిమాల్ని ఒకేసారి 11న వేసుకుందామని బన్నీ టీమ్ డిమాండ్ చేసింది.

కానీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ జోక్యం చేసుకొని వ్యవహారాన్ని సర్దిచెప్పింది. టెక్నికల్ సమస్యల్ని వివరించింది. అగ్రిమెంట్లు రద్దుచేసి మళ్లీ కొత్తవి రాసుకోవడం చాలా కష్టమని చెప్పింది. దీంతో పాటు 12వ తేదీకి ఓవర్సీస్ లో దాదాపు 10వేల టిక్కెట్లు అడ్వాన్స్ గా బుక్ అయిన విషయాన్ని కూడా గుర్తుచేసింది. దీంతో బన్నీ టీం వెనక్కి తగ్గింది.

First Published:  5 Jan 2020 2:26 AM GMT
Next Story