అనీల్ కు పుత్రోత్సాహం

ఓవైపు కెరీర్ లోనే అతిపెద్ద సినిమా చేస్తున్నాడు. మరో 6 రోజుల్లో అది రిలీజ్ అవ్వబోతోంది. ఈ ఆనందంలో ఉంటుండగానే మరో ఆనందాన్ని అందుకున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి.

ఈరోజు అనీల్ రావిపూడికి కొడుకు పుట్టాడు. ఇటు సినిమా రిలీజ్, అటు కొడుకు పుట్టడం.. ఇలా ఒకే వారంలో డబుల్ ఆనందాన్ని అందుకున్నాడు అనిల్ రావిపూడి. అనీల్ రావిపూడికి ఇది రెండో సంతానం. ఇంతకుముందు అనీల్ దంపతులకు పాప పుట్టింది.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ తో, రిలీజ్ వ్యవహారాలతో బిజీగా ఉన్నాడు అనీల్ రావిపూడి. సెన్సార్ కూడా పూర్తవ్వడంతో ఓవర్సీస్ కు ప్రింట్స్ పంపించడం, లోకల్ ప్రింట్స్ లో మిక్సింగ్ చూసుకోవడం లాంటి పనులతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో కొడుకు పుట్టడంతో మెంటల్లీ కాస్త ఫ్రీ అయ్యాడు. అనీల్ కు టాలీవుడ్ అంతా శుభాకాంక్షలు చెబుతోంది. మహేష్ కూడా ట్వీట్ చేశాడు.

ఈ సినిమాతో సూపర్ లీగ్ పై కన్నేశాడు అనీల్ రావిపూడి. ఇన్నాళ్లు అతడు మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేశాడు. ఎఫ్2తో మెయిన్ లీగ్ లోకి వచ్చాడు. ఇప్పుడు మహేష్ మూవీ హిట్ అయితే అగ్రదర్శకుల జాబితాలోకి చేరిపోతాడు ఈ దర్శకుడు.