Telugu Global
NEWS

చేతులారా చేసుకుంటున్న చంద్రబాబు?

తాను చేస్తే సంసారం… ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉంటోంది. అధికార పార్టీ ఏది చేసినా ఒంటికాలిపై లేచి మరీ గగ్గోలు పెడుతున్నారు. రాష్ర్టాభివృద్దికోసం పరిపాలనను సైతం వికేంద్రీకరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. జి.ఎన్.రావు కమిటీ, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలను సైతం చంద్రబాబు తూర్పార పడుతున్నారు. వాటిని చిత్తు కాగితాలతో పోలుస్తున్నారు. జి.ఎన్.రావు […]

చేతులారా చేసుకుంటున్న చంద్రబాబు?
X

తాను చేస్తే సంసారం… ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉంటోంది. అధికార పార్టీ ఏది చేసినా ఒంటికాలిపై లేచి మరీ గగ్గోలు పెడుతున్నారు.

రాష్ర్టాభివృద్దికోసం పరిపాలనను సైతం వికేంద్రీకరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. జి.ఎన్.రావు కమిటీ, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలను సైతం చంద్రబాబు తూర్పార పడుతున్నారు. వాటిని చిత్తు కాగితాలతో పోలుస్తున్నారు.

జి.ఎన్.రావు కమిటీ ఇచ్చిన నివేదికలో సమగ్రంగా విషయం అంతా ఉంది. బోస్టన్ కమిటీ నివేదికలోనూ సమాచారం అంతా పొందుపరిచారు. అయినా చంద్రబాబుకు మాత్రం అర్ధం కావడం లేదు.

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తీసుకున్న నిర్ణయాలు, ప్రజావ్యతిరేకత, వామపక్షాలు సైతం చేసిన ఆందోళనలపై చంద్రబాబు చాలా కఠినంగా వ్యవహరించారు. అరెస్టులు, నిర్బందాలతో అప్రజాస్వామికంగా వ్యవహరించారు. రాజధాని విషయంలోనూ ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకున్నారు.

గతంలో ఉమ్మడిరాష్ర్టంగా హైదరాబాద్ ఉన్న సమయంలో పాలన, అభివృద్ది అంతా ఒకే చోట కేంద్రీకృతం అయింది. దీనివల్ల రాష్ర్టం విడిపోయినపుడు కనీసం రాజధాని లేకుండా, వసతులు సైతం లేకుండా పోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వైసిపి ప్రభుత్వం పాలనను, అభివృద్దినీ వికేంద్రీకరణ చేయాలని సంకల్పించింది. దీనికోసం ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి జి.ఎన్.రావ్ కమిటీని, సాంకేతికాంశాల పరిశీలన కోసం బోస్టన్ కమిటీని నియమించింది. వీటికి అదనంగా హైపవర్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది.

ఆయా కమిటీలు చేసే సూచనలు, సలహాలను కనీసం పరిశీలించకుండానే చంద్రబాబు మండిపడుతున్నారు. దీని వల్ల తెలుగుదేశం పార్టీ ప్రజలకు మరింత దూరం అవుతుందే తప్ప ప్రజాభిమానాన్ని పొందే పరిస్థితులు కన్పించడం లేదు. రాష్ర్టంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలనే ఏకైక లక్ష్యంతో వికేంద్రీకరణ అంశాన్ని జగన్ తెరమీదకు తీసుకువ చ్చారు. మూడు రాజధానులు పెట్టడానికి కారణాలను వైసిపి స్పష్టంగా చూపిస్తోంది. కానీ వ్యతిరేకించడానికి సరైన కారణాన్ని తెలుగుదేశం పార్టీ చూపించలేకపోతోంది.

తన సామాజిక వర్గం ఉండే ప్రాంతంపై చంద్రబాబు చూపిస్తున్న అతిప్రేమ వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో టీడీపీ దెబ్బతింటున్న విషయాన్ని చంద్రబాబు గమనించడం లేదు. రాయలసీమకు కేంద్రం కేటాయించిన ఎయిమ్స్ లాంటి వాటిని గుంటూరుకు ఎందుకు తరలించాడో ఇప్పటికీ చంద్రబాబు దగ్గర సమాధానం లేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు కేంద్రం కేటాయించిన అదనపు నిధులను కూడా దారిమళ్ళించిన చంద్రబాబు ఇప్పుడు ప్రాంతీయ విభేదాలకు అతీతంగా అందరూ కలిసి అమరావతి రాజధాని కోసం పోరాడాలని కోరడం చూస్తే చంద్రబాబు నిజస్వరూపం ఏమిటో ప్రజలకు అర్థమౌతోంది.

పైగా కులం,ప్రాంతం అనే ముద్రలు వేస్తూ పబ్బం గడుపుకుంటోంది. దీనివల్ల సాధించేది ఏమీ లేకపోగా, ఉన్న ఇమేజ్ ని కూడా పోగొట్టుకునేలా చంద్రబాబు చేసుకుంటున్నారు.

First Published:  5 Jan 2020 1:54 AM GMT
Next Story