Telugu Global
National

కాకినాడ కాజాకు అరుదైన గౌర‌వం !

కాకినాడ కోటయ్య కాజా కు అరుదైన గౌరవం ద‌క్కింది. కాకినాడ కోటయ్య కాజా పేరుతో భారత ప్రభుత్వ తపాలా శాఖ స్టాంపు మరియు పోస్టల్ కవర్ ను రిలీజ్ చేసింది. కాజా అనేది ఓ స్వీటు. కాజా లలో… గొట్టం కాజా, మడత కాజా, చిట్టి కాజా ఇలా పలురకాలు వుంటాయి. కాజా లు ఎన్నో రకాలు వున్నా కాకినాడ లో తయారయ్యే ‘కాకినాడ కాజా’ ఎంతో ఫేమ‌స్‌. 1890 ప్రాంతంలో కాకినాడలో కోటయ్య అనే వ్యక్తి […]

కాకినాడ కాజాకు అరుదైన గౌర‌వం !
X

కాకినాడ కోటయ్య కాజా కు అరుదైన గౌరవం ద‌క్కింది. కాకినాడ కోటయ్య కాజా పేరుతో భారత ప్రభుత్వ తపాలా శాఖ స్టాంపు మరియు పోస్టల్ కవర్ ను రిలీజ్ చేసింది.

కాజా అనేది ఓ స్వీటు. కాజా లలో… గొట్టం కాజా, మడత కాజా, చిట్టి కాజా ఇలా పలురకాలు వుంటాయి. కాజా లు ఎన్నో రకాలు వున్నా కాకినాడ లో తయారయ్యే ‘కాకినాడ కాజా’ ఎంతో ఫేమ‌స్‌. 1890 ప్రాంతంలో కాకినాడలో కోటయ్య అనే వ్యక్తి కాజా మొద‌ట త‌యారు చేశారు. గొట్టం కాజా ఎంతో రుచికరం గా ఉంటుందన్న పేరొచ్చింది.

అప్ప‌టి నుంచి ఈ కాజాకు ‘కాకినాడ కోటయ్య కాజా’ గా పేరు వ‌చ్చింది. అటువంటి కాకినాడ కోటయ్య కాజా పై భారత ప్రభుత్వ తపాలా శాఖ వారు స్టాంపు, పోస్టల్ కవర్ ను రిలీజ్ చేశారు. దీంతో కాకినాడ కాజాతో ఆంధ్రుల గౌరవం పెరిగిందని గోదావ‌రి వాసులు మురిసిపోతున్నారు.

First Published:  4 Jan 2020 11:36 PM GMT
Next Story